Tulsi Plant : అమావాస్య , ఆదివారం తులసి మొక్కకు నీళ్లు ఎందుకు పోయకూడదో తెలుసా..?

Tulsi Plant : హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు దేవుళ్లను ఎంతో శ్రద్ధగా ప్రార్థిస్తారు. తులసి మొక్కను కూడా అంతే శ్రద్ధగా పూజి స్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా దేవుడిగా భావించే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రతిరోజు నిత్యం ఉదయం , సాయంత్రం దీపం వెలిగించి తులసికోట దగ్గర పూజ చేస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడంవల్ల సకల సంపదలు కలుగుతాయని ఇబ్బంది ఉండదు అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

ఇక ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు దీపారాధన చేసి పూజించిన అప్పుడు ఖచ్చితంగా అమ్మవారు ఆ ఇంట్లో కొలువై ఉంటుందట.ఇకపోతే తులసి మొక్కకు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు.. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటారు. అలా తులసి మొక్క కి నీరు పొసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎప్పుడు నీళ్లు పోయాలి.. ఎప్పుడు పూజించాలి వంటి విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.ముందుగా తులసి మొక్కకు అమావాస్య, ఆదివారం రోజున అసలు నీళ్లు పోయకూడదు. అలాగే సాయంత్రం సమయంలో నీళ్లు పోయకూడదు.

Do you know why water should not be given to the Tulsi Plant on New Moon and Sunday
Do you know why water should not be given to the Tulsi Plant on New Moon and Sunday

ఇక సాయంత్రం సమయంలో తులసి మొక్కకు ఎందుకు నీళ్లు పోయకూడదు అనే విషయానికి వస్తే.. సాయంత్రం సమయంలో తులసి మొక్క కింద శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సతీసమేతంగా ఉంటారు అని ఆ సమయంలో వారికి ఇబ్బందులు కలుగుతాయని.. ఇక నీళ్ళు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని పండితులు చెబుతారు. అంతేకాదు పౌర్ణమి , అమావాస్య , సూర్య చంద్ర గ్రహణాలలో కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు.ఇంటి ముందు నాటిన తులసి మొక్క ఆ ఇంటి పెద్ద యొక్క ఆ విషయం కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తులసి మొక్క పచ్చగా ఉండేలా జాగ్రత్త పడాలి.