Saturday, July 2, 2022

Health Benefits : ఆరోగ్య కానుకలు ఇచ్చే ఈ చెట్టు గురించి మీకు తెలుసా..!?

Health Benefits : కానుగ చెట్టు రోడ్డుకిరువైపులా మనకి ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది.. ఈ చెట్టు గాలిని పిలిస్తేనే అనేక రోగాలు నయమయిపోతాయి.. ఈ చెట్టు ని పొంగం ఆయిల్ ట్రీ, ఇండియన్ బీచ్, పొంగమియా పిన్నట అని కూడా అంటారు. ఈ చెట్టు ప్రతి భాగం కూడా గొప్ప ఔషధాలను కలిగి ఉంది. ఆకులు బెరడు, పువ్వులు, కాయలలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. కానుగ చెట్టు ఇచ్చే ఆరోగ్య కానుకలు ఏంటంటే..!?

కానుగ చెట్టు ఆకులను ముక్కలుగా చేసి ఒక గ్లాసు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి తరువాత ఆ నీటిని వడ పోసుకొని గోరువెచ్చగా తాగితే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో యాంటీ బాడీస్, తెల్ల రక్తకణాలు పెరగడంతో ఎటువంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దాడి చేయలేవు. ఒకవేళ ఏమైనా హానికర బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఎటువంటి ప్రమాదము జరగదు. ఈ ఆకుల కషాయం తాగితే కడుపునొప్పి నీళ్ల విరోచనాలు దగ్గు గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి గనేరియా సమస్యకు ఈ ఆకుల కషాయం చెక్ పెడుతుంది.

Health Benefits Of Kanuga Chettu
Health Benefits Of Kanuga Chettu

చెట్టు ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లు ఉన్నచోట వేసి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉంటే గాయాలు త్వరగా మానిపోతాయి. కానుగ ఆకులను వేడిగా ఉన్న బియ్యం గంటలో వేసి కాస్త చల్లారిన తర్వాత ఆ ఆకులను తీసి ఆ గింజిని తాగాలి. ఇలా చేయడం వల్ల వాంతులు తగ్గుతాయి.‌ ఈ చెట్టు పుల్లలతో దంతధావనం చేస్తే దంత సమస్యలు తగ్గుతాయి. చిగుళ్లను బలోపేతం చేస్తుంది. ఈ చెట్టు బెరడు నూరి రక్తమొలలు పైన లేపనంగా రాస్తే ఉంటే సమస్య తొందరగా తగ్గుతుంది. కానుగ చెట్టు వేర్ల పొడి పక్వానికి వచ్చిన గడ్డలు మీద రాస్తే అవి త్వరగా పగిలిపోయి అందులో ఉండే బ్యాక్టీరియా బయటకు వస్తుంది.

Related Articles

- Advertisement -

తాజా వార్తలు