Saturday, July 2, 2022

Money : ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. డబ్బు వచ్చినట్టే..?

Money : సాధారణంగా డబ్బు ఇంట్లోకి రావాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు బాగా పనిచేస్తాయి అని చెబుతారు. అంతే కాదు హిందూ పురాణాల ప్రకారం కొన్ని మొక్కలను ప్రత్యేకంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం జరుగుతోంది. ముఖ్యంగా ఆ మొక్కలను మీ ఇంట్లో పెంచినట్లయితే ఆ ఇల్లు ధనధాన్యాలతో.. భోగభాగ్యాలతో తులతూగుతుంది అని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని పెద్దలు చెబుతున్నారు. ఇకపోతే ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే ధన ధాన్యాలకు ఇబ్బంది ఉండదో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

మనీ ప్లాంట్ : చాలామంది ఇళ్లల్లో ఈ మొక్కలు లక్ష్మీదేవితో సమానంగా భావించి.. పవిత్రంగా పెంచుతూ పూజలు, పురస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే ఆర్దికంగా ఎటువంటి కొరత లేకుండా ఉండాలంటే మనీ ప్లాంట్ తో పాటు ఇతర మొక్కలు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది.

If these plants are in your house then money is coming
If these plants are in your house then money is coming

వెదురు మొక్క : వెదురు మొక్క ఇంటికి ధనాన్ని తీసుకురావడానికి మార్గాలను ఏర్పాటు చేస్తుంది. కేవలం ఇంట్లోనే కాకుండా ఆఫీసులలో.. పనిచేసే ప్రదేశాలలో కూడా వెదురు మొక్కలు పెంచుకుంటే కచ్చితంగా లాభాలకు దారులు ఏర్పడతాయి . ముఖ్యంగా చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది. అందుకే చాలామంది వెదురు మొక్కలను ఇంట్లో పెంచుకోవదానికి ఆసక్తి చూపుతారు.

దానిమ్మ మొక్క : దానిమ్మ మొక్క రుచిని మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి స్వరూపంగా ఈ మొక్కలు పూజిస్తారు. కాబట్టి ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక నష్టం వాటిల్లదు. నిజానికి మొక్కలు ఇంటిని అందంగా ఉంచడమే కాకుండా ఆ ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సుకి కూడా ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల చాలా శుభప్రదం. అందుకే ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఈ మొక్కల్ని పెంచుకుంటే ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది. కావలసి వస్తే బిల్వ మొక్కలు , గుమ్మడి తీగ మొక్కలు కూడా మీ ఇంటి పెరటిలో నాటుకోవచ్చు

Related Articles

- Advertisement -

తాజా వార్తలు