Headache : తలనొప్పి అధికంగా వస్తోందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!!

Headache : తలనొప్పి.. దీనికి కారణాలు చాలానే ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఒకసారి తలనొప్పి వచ్చింది అంటే చాలు తీవ్రంగా భరించలేని నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాదు ఎవరైనా మాట్లాడితే చికాకుగా, శబ్దాలు తట్టుకోలేనంతగా , దృశ్యాలు కూడా చూడలేనంతగా అనిపిస్తూ ఉంటుంది. భోజనం ఆలస్యమైనా .. ఎండలో ఎక్కువసేపు తిరిగినా.. నిద్ర తక్కువైనా.. ప్రయాణం చేసినా.. జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినా కూడా తలనొప్పి అధికంగా వస్తుంది. అయితే మరి కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా కూడా తలనొప్పి వస్తుంది..

ఇక తలలో ఉన్న రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు తలనొప్పి వస్తుంది అనేది మరి కొంత మంది వాదన. ఇటీవల కాలంలో పనిq ఒత్తిడి, నిద్రలేమి టెన్షన్ జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తలనొప్పి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నా సరే తక్షణమే చికిత్స చేయించుకోవాలి. ఇకపోతే కొన్ని రకాల తలనొప్పులు ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి ఉన్నప్పుడు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడం మంచిది. మనం తీసుకునే ఆహారం కూడా మన తలనొప్పికి కారణం అవుతుంది.

Is the headache getting worse
Is the headache getting worse

కాబట్టి సమయానికి భోజనం చేయడం తప్పనిసరి. ఇక తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు లేదా టీ , కాఫీ లాంటివి తాగినా మీకు ఉపశమనం కలుగుతుంది.తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు అరటిపండు , పైనాపిల్ జ్యూస్ వంటివి కూడా తాగవచ్చు. అరటిపండు, పైనాపిల్ రెండింటిని తీసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి పాలు, నట్స్, పంచదార వేసి బాగా మిక్స్ చేసి తాగవచ్చు. ఇక ఇలా ఎవరైనా సరే తలనొప్పితో బాధపడుతూ ఉంటే ఈ చిట్కాను పాటించండి. అంతే కాదు ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఈ ఆర్టికల్ షేర్ చేసి సమాచారం అందించండి.