Thamboolam : తాంబూలం ఎందుకు ఇవ్వాలి .. అంత ప్రత్యేకత ఎందుకు..?

Tamboolam : తమలపాకులు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా దేవుడికి పూజ చేసేటప్పుడు తాంబూలం కచ్చితంగా సమర్పిస్తారు. ఇంటికి వచ్చిన మహిళలకు కూడా తప్పకుండా కుంకుమ బొట్టు , జాకెట్ పీస్ తో పాటు తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. తాంబూలం అంటే తమలపాకులు, వక్కలు, సున్నం, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చేది తాంబూలం. వివాహాది వంటి శుభకార్యాలలో ఎక్కువగా కిల్లి పేరిట ఈ తాంబూలాన్ని ఇస్తూ ఉంటారు. తాంబూలం తినడం వల్ల జీర్ణశక్తి , రోగనిరోధకశక్తి రెండూ కూడా రకరకాల నిష్పత్తుల లో పెంచుకోవచ్చు అని పండితులు చెబుతుంటారు.

ఆరోగ్య సంరక్షణ కోసం తాంబూలంలో జాజికాయను, జాపత్రి, పచ్చ కర్పూరం , కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను వేసి తాంబూలం గా ఇస్తూ ఉంటారు. పెళ్లి, గృహ ప్రవేశం లాంటి తదితర శుభకార్యాల్లో కూడా భోజనం తరువాత తాంబూలం అందించడం ఆనవాయితీ. వివాహ నిర్ణయ సందర్భాన్ని కూడా నిశ్చయ తాంబూలం అని పిలవడాన్ని బట్టి చూస్తే మన సాంప్రదాయంలో తాంబూలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. పూజ లో తప్పకుండా తాంబూలం స్వామివారికి సమర్పిస్తారు. పెద్దలను, గురువులను కలవడానికి వెళ్లినప్పుడు కూడా తాంబూలంలో పండ్లు పెట్టి ఇవ్వడం పరిపాటి.ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైన వారిని పలకరించే సందర్భం లో తాంబూలం ఇవ్వకూడదని.. ఇది సాంప్రదాయ రీత్యా నిషేదం.

Why give Thamboolam Why so special
Why give Thamboolam Why so special

రకరకాల ఉత్ప్రేరకాలతో సేవించే తాంబూలం వల్ల ఆరోగ్యానికి హాని కూడా కలుగుతుంది. ఇక తమలపాకులను తీసుకోవడంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు తమలపాకు తీసుకోవాలని అనుకున్నప్పుడు వెనుక ఉండే తొడిమ ను తుంచి వేయాలి. అలాగే తమలపాకు నోట్లోకి వేసుకున్న తర్వాత నమిలి తర్వాత మొదటి లాలాజలాన్ని బయటకు మూయాలి. ఇకపోతే శరీరానికి అనారోగ్యం చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత నమిలినప్పుడు వచ్చేలా చేయాలని మింగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తాంబూలం యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.