Hair Tips : జుట్టు పెరుగుదలకు ఉల్లి మంచిదేనా..?

సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. నిజానికి ఉల్లి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు జుట్టు ప్రయోజనాలు కూడా మెరుగ్గా ఉంటాయి.. నిజానికి జుట్టు పెరుగుదలకు ఉల్లి చాలా మంచిది అని సౌందర్యనిపుణులు చెబుతూ ఉంటారు. అంతే కాదు ఉల్లి లో ఉండే కొన్ని రసాయనాల సమ్మేళనాల వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లిని పేస్టుగా చేసి లేదా జ్యూస్ రూపంలో జుట్టుకు అప్లై చేసినా సరే జుట్టు సమస్యలు దూరం అవుతాయి.ఇలా ఉల్లి పేస్టుని తల మాడుకు పట్టించడం వల్ల, అక్కడ రక్తనాళాలలో ఆక్సీజన్ సరఫరా బాగా జరుగుతుంది.

ఉల్లిపాయలో ఉండే ” క్యాంపీఫెరాల్ అలాగే క్వర్సెటిన్” అనే రసాయనాలు జుట్టు కుదుళ్ళకు ఉండే రక్తనాళాలు వ్యాకోచం చెందేలా చేస్తాయి. అంటే రక్తనాళాలు వెడల్పు అయ్యేందుకు ఈ రసాయనాలు సహాయపడతాయన్నమాట. ఇక ఈ రక్తనాళాలు తెరుచుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితం జుట్టు రాలే సమస్య దూరం అవడంతో పాటు మాడు మీద ఏర్పడే చుండ్రు, దురద నుండి జుట్టును సంరక్షించుకోవచ్చు.ఇక ఉల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఘాటుకి తట్టుకోలేక, మనకు కళ్ళ వెంట , ముక్కు వెంట నీళ్లు రావడం సహజం.

Is onion good for hair growth
Is onion good for hair growth

ఇక ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ ను జుట్టుకు పట్టిస్తామో , అప్పుడు జుట్టు కుదుళ్లలో వుండే కెరటోనాయిడ్స్ ఉత్పత్తిని, ఈ సల్ఫర్ వేగవంతం చేస్తుంది. ఫలితంగా కెరటిన్ కలిగిన జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉల్లిలో ఉండటం వల్ల, జుట్టు కుదుళ్ల మీద ఏర్పడే ఫంగస్ లేదా బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎలా చూసుకున్నా సరే ఉల్లి వల్ల జుట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.. మీరు కూడా జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఉల్లిని ఒక్కసారి ఉపయోగించి చూడండి.