Health Benefits : నొప్పులకు అపర సంజీవని ఈ ఆకు పొడి..!

Health Benefits : ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదాలు ఆకుకూరలు..! వాటిలో చెన్నంగి ఆకుకూర కూడా ఒకటి.. చెన్నంగి ఆకు గ్రామీణ వైద్యానికి పెట్టింది పేరు..! చెన్నంగి చెట్టును కసింద, కసివింద, కాఫీ సెన్న, నీగ్రో కాఫీ అని కూడా పిలుస్తారు.. ఈ ఆకుకూర వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!చెన్నంగి ఆకులలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఈ అకులు నాడీ నొప్పులను తగ్గిస్తుంది.

చెన్నంగి ఆకుల పొడిని ప్రతిరోజు అన్నంలో వేసుకుని తింటే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అజీర్తి, కడుపులో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చెన్నంగి ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి కలిపి పక్షవాతం ఉన్నచోట రాస్తే సమస్య త్వరగా తగ్గుతుంది. పక్షవాతం ఉన్నవారికి చెన్నంగి ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. ఈ చెట్టు గింజలను దంచి పొడి చేసుకొని..

health benefits in health benefits in Chennangi Aaku Podi Aaku Podi
health benefits in Chennangi Aaku Podi

ఆ పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.ఈ చర్య తీసుకుని ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పుల్లటి మజ్జిగ లేదా పుల్లటి పండ్ల రసంతో కలపాలి. ఈ మిశ్రమాన్ని గజ్జి తామర దురద ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి సొరియాసిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ చెట్టు వేర్లను సమూలంగా ఎండించి పొడిచేసి రాసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఈ చెట్టు కాయలు గింజల తో కాఫీ తయారు చేసుకొని తాగితే టెన్షన్ ఒత్తిడి డిప్రెషన్ పరార్. అలసటను తగ్గిస్తుంది ఈ కాఫీ.