Intinti Gruhalakshmi 1 April Today Episode : నందు పెద్ద ఫెయిల్యూర్.. తులసి రియాక్షన్ కి నోట మాట రాలేదుగా నందుకి..!

Intinti Gruhalakshmi 1 April Today Episode : ప్రేమ్ ఫ్రెండ్ ఫోన్ చేసి మీ తాతయ్య నానమ్మ మదర్థెరిసా వృద్ధాశ్రమంలో ఉన్నారు అని చెబుతాడు.. ఇక అదే విషయాన్ని శ్రుతితో చెప్పి వెంటనే అమ్మకు చెప్పాలి అని ఫోన్ చేయబోతాడు. శృతి ఆంటీ కి వద్దు మాధవి ఆంటీకి ఈ విషయాన్ని చెప్పు అని చెబుతుంది. ప్రేమ్ వాళ్ళ అత్తయ్య మాధవికి ఫోన్ చేసి తాతయ్య నానమ్మలు ఎక్కడ ఉన్నారో చెబుతాడు. అలాగే నేను మీకు ఈ విషయాన్ని చెప్పిన సంగతి అమ్మకు చెప్పవద్దు అని చెబుతాడు.. మాధవి ద్వారా నిజం తెలుసుకున్న తులసి పరుగుపరుగున వృద్ధాశ్రమానికి వెళ్తుంది..!మావయ్య.. ఏమ్మా.. నువ్వు ఇలా ప్రశాంతంగా బతకడం నీకు ఇష్టం లేదా ఎందుకమ్మా మా వెనక మల్ల పెడుతున్నావు అని అంటాడు వాళ్ల మామయ్య మీకు మీ అబ్బాయి తో వెళ్ళడం ఇష్టం లేక పోతే అదే మాట నాతో చెప్పి ఉండాల్సింది మావయ్య.. మేము నందు తో వెళ్ళము అంటే.. నువ్వే మా నోరు నొక్కేసావు.. విషం లో కూడా అమృతాన్ని వెతికే స్వచ్ఛమైన మనసు వదినది అలాంటి వదినను మీరు కూడా ఎందుకు

నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని అంటుందిమాధవి అది వాళ్ళ తప్పు కాదు మాధవి మీ అన్నయ్య తో వెళ్ళమని నేను చాలా బలవంతం చేశాను ఆ బాధతో వాళ్లు అంటున్నారు.. నేను మీ అన్నయ్య తో ఉండే అదృష్టాన్ని ఇస్తున్నాను అని అనుకున్నాను కానీ.. వీళ్ళు ఇంతలా బాధ పడతారు అని అనుకోలేదు.. వాడు నిన్ను వద్దు అనుకున్నప్పుడే తనతో బంధం తెంపేసుకున్నాను.. నిన్ను బాధ పెట్ట లేక మేము ఇబ్బంది పడలేక ఇల్లు వదిలి పెట్టేసి ఇలా వచ్చేసామమ్మ. ఇక్కడ ఈ ఆశ్రమంలో మాకు బాగానే ఉంది. మీరు అనాధలు కాదు మావయ్య.. మీరు లేక మేము అనాధలం అయ్యాము. నేను చేసిన తప్పుకి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను.. క్షమించండి మావయ్య.. మన ఇంటికి వెళ్దాం రండి మావయ్య. మీ ఇంటికి మేము రాము. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వృద్ధాశ్రమం ఎదుట దీక్ష చేస్తాను. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా మీ అబ్బాయితో అస్సలు పంపించను అని ఒప్పిస్తుంది.

Intinti Gruhalakshmi Serial 1 April Today full Episode
Intinti Gruhalakshmi Serial 1 April Today full Episode

మొత్తానికి వాళ్లు కూడా రావడానికి ఒప్పుకుంటారు.. ఇదంతా ప్రేమ్ ఒక పక్కన నుంచి చూస్తూనే ఉంటాడు. నేను అమ్మ దగ్గర లేకపోయినా అమ్మకు తాతయ్య నానమ్మ లను దగ్గరగా చేర్చాను. నాకు ఆ తృప్తి చాలు అని మనసులో అనుకున్నాడు.మాకు నచ్చిన పని మేము చేస్తాం. అంత నిక్కచ్చిగా ఉండేవారు అయితే మీ నిర్ణయాన్ని తులసికి చెప్పి ఉండాల్సింది అని లాస్య అంటుంది. మోసం గురించి మాట్లాడుతుంటే వినడానికి అసహ్యంగా ఉంది లాస్య. నాన్న మా వాళ్ళ ఏమైనా తప్పులు జరిగి ఉంటే నన్ను క్షమించండి. కొడుకుగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది మీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. దయచేసి మాతో రండి అని నందు వాళ్ళ అమ్మానాన్నలు అడుగుతాడు. తులసి ఇ వాళ్ళ అమ్మ వాళ్ళ లాగే తీసుకెళ్లి వాళ్ల రూమ్ లో పెట్టమని రాములమ్మ తో చెబుతుంది. తులసి నువ్వు నాతో చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏంటి అని అంటుంది.

మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కదా ఇలా చేస్తే మీకు తృప్తి గా ఉంటుంది. అత్తయ్య మావయ్య మీతో రావడానికి సిద్ధంగా లేరు. వాళ్లని దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాను. నా తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇక వాళ్ళు మీతో రారు. ఇక మీరు వెళ్ళాలి అనుకుంటే అది మీ ఇష్టం వాళ్ల నిర్ణయాన్ని మీరు గౌరవించండి. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను.తప్పు చేస్తున్నావు తులసి అనుభవిస్తావు అని నందు అనగానే ఇస్తున్నారా నందగోపాల్ గారు మీకంటే ముందే నన్ను ఆ దేవుడు క్షపించాడు. అందుకే మీతో తాళి కట్టించుకున్నా శిక్ష అనుభవిస్తున్నాను. ఇంతకంటే నన్ను ఎవరు ఏం చేస్తారు చెప్పండి. నన్ను నమ్మించి మోసం చేసావ్. కాదు మిమ్మల్ని నమ్మి మోసపోయాను. నా జీవితాన్ని నష్టపోయాను. మా అమ్మానాన్నల్ని నాకు కాకుండా చేస్తున్నావ్. నేను చేయలేదు మీకు మీరే చేసుకున్నారు. ఎవరికోసం చేశారో..

Intinti Gruhalakshmi Serial 1 April Today full Episode
Intinti Gruhalakshmi Serial 1 April Today full Episode

ఎందుకోసం చేసుకున్నారో.. గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశ్నించుకోండి మీకే సమాధానం దొరుకుతుంది అని తులసి అంటుంది. నేను నిన్ను వదిలేశాను అని ఒక తీర్చుకుంటున్నా వా ఒక చిన్న కరెక్షన్ నందగోపాల్ గారు మీరు నన్ను వదిలే లేదు మీ ప్రవర్తన మీ తీరు మీ పద్ధతి నచ్చ లేక నేనే మిమ్మల్ని వదిలించుకున్నాను. కట్టుకున్న నా పెళ్ళాం ముందే పరాయి ఆడదానితో తిరుగుతున్న మీ మీ పద్ధతి నచ్చక మిమ్మల్ని వదిలేశాను. భార్యగా నువ్వు ఒక పెద్ద ఫెయిల్యూర్ అందుకే నేను నిన్ను వదిలేసాను. అవును మరి నీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాతికేళ్లు ఎదురు తిరగకుండా కాపురం చేశాను. అది నా ఫెయిల్యూర్.. అంటూ తులసి తన మనసులోని భావాలను బయట పెడుతుంది తులసి మాటలకి కోపం వచ్చిన నందు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి సిద్ధపడతాడు.