Panipuri : అందరూ ఇష్టంగా తినే పానీపూరి హిస్టరీ తెలిస్తే షాక్..!!

Panipuri : రోడ్ సైడ్ స్నాక్స్ అమితంగా ఇష్టపడే వారిలో పానీపూరి ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా పానీపూరి తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పానీపూరిని ఇష్టపడతారు అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాలకు చెందిన వారు కూడా భారతదేశంలో పానీపూరీ ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఈ పానీపూరి నీ ముందు ఎవరు కనిపెట్టారు.. ఎక్కడినుంచి వచ్చింది.. ఎప్పుడు ప్రారంభించారు..ఇలా అన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఇక పానీపూరీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే చారిత్రక, పౌరాణిక కథనాలు కూడా వాడుకలో ఉన్నాయి.

ఇక పానీపూరీ గురించి మహాభారతంలో కూడా చెప్పబడింది. అదేమిటంటే ద్రౌపది పాండవుల కోసం మొదటిసారిగా తయారు చేసిన వంటకం కూడా పానీపూరి కావడం గమనార్హం. వివాహం అనంతరం ద్రౌపది తన అయిదుగురు భర్తలు పాండవులతో అత్త మామ ఇంటికి వెళుతుంది. అప్పుడు అత్తగారైన కుంతీదేవి తన కోడలు ద్రౌపదిని పరీక్షించడానికి ఒక పరీక్ష పెడుతుంది. ఆ సమయంలో పాండవులు వనవాసం లో ఉంటారు . తినడానికి కూడా పెద్దగా ఏది ఉండేది కాదు. ఇక ఆ పరిస్థితిలో కుంతీదేవి తన కోడలు ద్రౌపది తన ఇంటిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందో పరీక్షించాలని అనుకుంటుంది.

If you know the history of Panipuri
If you know the history of Panipuri

ఈ క్రమంలోనే మిగిలిపోయిన బంగాళదుంపలు, సుగంధద్రవ్యాలు, కొద్దిగా పిండిని కుంతీదేవి ద్రౌపదికి ఇస్తుంది .వీటితో రుచికరమైన వంటలు తయారు చేయమని చెబుతుంది. అంతేకాదు ఐదుగురు పాండవులకు నచ్చేలా ఏదైనా వంటకం వండాలి అని ఆమె చెబుతుంది. ఈ పరిస్థితిలో ద్రౌపది పిండితో చిన్న చిన్న చేసి పూరీ లు చేసి అందులో ఉడకబెట్టిన బంగాళదుంపలు, వేడి నీటితో వడ్డిస్తుంది.. ఈ వంటకం పాండవులకు బాగా నచ్చడంతో పానీపూరి వారికి ఇష్టమైన ఫుడ్ గా పూర్తిగా మారిపోతుంది. ఇక దీంతో కుంతిదేవి సంతోషించి ద్రౌపది తెలివిని మెచ్చుకుంటుంది.