Skin Problems : చర్మ సమస్యలను దూరం చేసే అరటి తొక్క..ఎలా అంటారా..?

Skin Problems : అరటిపండు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక అరటిపండు తొక్కలో కూడా అంతే స్థాయిలో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా అరటి తొక్క లో మనకు ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇక జీర్ణసంబంధిత సమస్యలు అయినటువంటి గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతే కాదు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా డిప్రెషన్ ని తగ్గించడానికి సహాయపడుతాయి. ఇకపోతే అరటి తొక్క వల్ల చర్మ సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు.

అరటి తొక్క వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.మొటిమలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే అలాంటి వారికి చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మొటిమల సమస్యకు చాలా ఎఫెక్టివ్ గా అరటి తొక్క పనిచేస్తుంది. ఇక అరటిపండు తొక్క లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమల పైన అరటిపండు తొక్కతో రుద్దినట్లయితే మొటిమల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన మలినాలను కూడా దూరం చేయడంలో అరటి తొక్క చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

Banana peel to get rid of Skin Problems
Banana peel to get rid of Skin Problems

ఇక ఎండ తాకిడి వల్ల చర్మంపై మచ్చలు వస్తే అరటి తొక్క చర్మంపై రుద్దడం వల్ల ట్యాన్ ను దూరం చేసుకోవచ్చు.కాలిన గాయాలు , పుండ్లు, దెబ్బలు వంటివాటిపై అరటిపండు తొక్కతో రుద్ధితో తొందరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు కాలిన గాయాలు త్వరగా మానిపోతాయి. ఇక కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు దంత సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. దంతాలు పచ్చగా ఉన్నట్లయితే అరటిపండు తొక్కతో పళ్ళపై రుద్దాలి. ఆ తర్వాత రెగ్యులర్ టూత్ పేస్టుతో బ్రష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు పళ్లపై అరటి తొక్కతో రుద్దినట్లయితే దంతాలు తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. అంతేకాదు దంతాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.