Financial Wealth : ఆర్థిక సంపద పెరగాలంటే ఇంటి గుమ్మం ముందు వీటిని ఉంచకండి..!!

Financial Wealth : హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటి గుమ్మాన్ని సింహద్వారం అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సింహ ద్వారం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఇంటి గుమ్మానికి అంత ప్రాధాన్యత ఉంది. అంతే కాదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ , పాజిటివ్ ఎనర్జీ రెండూ కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇక మనం చిన్న పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఇంట్లో సానుకూల ప్రభావం ఏర్పడటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత నెలకొంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంపద పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటి గుమ్మం ముందు వీటిని ఉంచకండి.

ఒక వేళ తెలిసి తెలియక మీరు గుమ్మం వద్ద ఈ వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహం చెంది మీపై ఆర్థిక నష్టం కలిగిస్తుంది. ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు ఇల్లు కట్టిన తర్వాత కూడా వాస్తు విషయాలను చాలా జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటికి అంత మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే ఇంటి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.అందులో భాగంగానే చాలామంది ఇంటి గుమ్మం ఇరువైపుల డస్ట్ బిన్ లాంటివి పెడుతూ ఉంటారు . ఇలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగకపోగా .. పైగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది . ఇక లక్ష్మీదేవి ఆగ్రహం చెంది ఆర్థిక నష్టం కలిగిస్తుంది.

Do not put these in front of the door of the house to increase financial wealth
Do not put these in front of the door of the house to increase financial wealth

ఈ కాలంలో చాలామంది ఖాళీ స్థలం లేక ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాక్ లాంటివి పెడుతూ ఉంటారు. ఇక మెయిన్ ఎంట్రెన్స్ కి దగ్గర కాకుండా కొద్దిగా దూరంగా పెడితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించలేదు. ఇక ఆ ప్లేస్లో మీరు ఏదైనా ఒక అందమైన పచ్చని మొక్కలు పెట్టుకోవడం ఉత్తమం. ఇటీవల కాలంలో చాలా మంది గుమ్మం డోర్ ని స్లైడ్స్ రూపంలో పెట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం అలా పెట్టుకోవడం వల్ల అస్సలు మంచిది కాదని.. ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మం తలుపు తీసేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. అంతేకాదు గుమ్మం తలుపు బయటకు వచ్చేలా చూసుకోవాలి. ఇక లోపలికి ఉండేలా గుమ్మం డోర్ పెట్టుకోవడం అంత శుభకరం కాదు. ఇక ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సర్దుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సంపద పెరుగుతుంది.