Pumpkin:  గుమ్మడి కాయ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Pumpkin: సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం గుమ్మడికాయను ఎక్కువగా దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. అంతే కాదు కొత్త ఇంటిని నిర్మించిన తర్వాత ఆ ఇంటి పైన నరదృష్టి పడకుండా గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు. ఇంటికి ఏదైనా కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు లేదా కొత్త వ్యాపారాలను మొదలుపెట్టినప్పుడు.  దూర ప్రాంతాల నుండి  ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా గుమ్మడికాయ ను దిష్టి తీయడానికి ఉపయోగించడం గమనార్హం .. ఈ గుమ్మడి కాయ కేవలం నరదృష్టికి నివారణ మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటు.  కేవలం ఆరోగ్యానికే కాదు సౌందర్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.

If you know the benefits of pumpkin, you should be shocked
If you know the benefits of pumpkin, you should be shocked

గుమ్మడి కాయ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ముఖ్యంగా గుమ్మడికాయలో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇక ఈ బీటాకెరోటిన్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేసి ఒంట్లోకి చేరిన తర్వాత విటమిన్-ఎ రూపంలోకి మారిపోతుంది. అంతేకాదు విటమిన్-ఇ, విటమిన్-సి, ఫోలేట్,  ఐరన్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఒక కప్పు గుమ్మడి ముక్కలను తినడం వల్ల మనకు రోజుకు అవసరమైన విటమిన్ ఎ కూడా లభిస్తుంది.

If you know the benefits of pumpkin, you should be shocked
If you know the benefits of pumpkin, you should be shocked

దృష్టి లోపం ఉన్న వారు గుమ్మడి కాయ తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఈ కారణంగా కంటి సమస్యలు దూరమవుతాయి.  కిడ్నీలు,  ఊపిరితిత్తులు,  గుండె వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి గుమ్మడి కాయ లో ఉండే పోషకాలు ఎంతగానో సహాయపడతాయి. గుమ్మడి కాయ లో ఉండే పొటాషియం కారణంగా రక్తపోటు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక పక్షవాతం వచ్చే ఆస్కారం కూడా ఉండదు.  మంచి కొవ్వు స్థాయిలు పెరిగేలా చేస్తుంది. ఎక్కువ పోషకాలు.. క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. గుమ్మడి గింజల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి వేయకుండా , బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  పీచు కారణంగా మలబద్దకం సమస్య కూడా దూరం అవుతుంది. ఇక నిద్ర బాగా పట్టడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.