Eyelashes : వెంట్రుకలు కూడా మీ ముఖం యొక్క అందాన్ని రెట్టింపు చేస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. పొడవైన జుట్టు ఉండడమే కాదు కనుబొమ్మలు, కనురెప్పలకు కూడా దట్టమైన వెంట్రుకలు ఉండడం వల్ల అందం కూడా పెరుగుతుంది. మందపాటి, పొడవాటి వెంట్రుకలు ఉండటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా కనుబొమ్మలు , కనురెప్పలు అందం గా పెరగడానికి కూడా మార్కెట్లో అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నా కూడా అవన్నీ సాంప్రదాయ ఇంటి నిర్వహణ లాగా ప్రభావవంతంగా పనిచేయవు.
విటమిన్ ఈ అనేది జుట్టు పెరగడానికి చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ను విటమిన్ ఈ సప్లిమెంట్ ను అందిస్తుంది.. ముఖ్యంగా ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు విటమిన్ ఈ క్యాప్సిల్ నూనెను కనుబొమలు, కను రెప్పలపై దూది సహాయంతో అప్లై చేసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నూనెను రాత్రిపూట అప్లై చేసి ప్రతిరోజు పునరావృతం చేసినట్లయితే తప్పకుండా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. అలాగే కనురెప్పలు కూడా జాగ్రత్తగా కంట్లోకి పడకుండా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా కనురెప్పలు కూడా బాగా పెరుగుతాయి.
గ్రీన్ టీ : గ్రీన్ టీ లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్ధిగా లభించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రేరేపించడం లో చాలా చక్కగా సహాయపడుతుంది. తాజాగా ఒక కప్పు తీసుకొని అందులో వేడి నీళ్లు పోసి గ్రీన్ టీ బ్యాగులను వేయాలి. అందులో కాటన్ క్లాత్ ముంచి గ్రీన్టీని కనురెప్పల పైన అలాగే కింది భాగంలో కూడా చాలా జాగ్రత్తగా కంట్లోకి పడకుండా అప్లై చేయాలి. కనీసం ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.ఇంట్లో దీపానికి ఉపయోగించే ఆముదం నూనెతో కూడా కనుబొమ్మలు, కనురెప్పలను పెంచుకోవచ్చు.