Pawan Kalyan: క్షేత్రస్ధాయిలో దృష్టిపెట్టకపోతే కష్టమేనా ?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అసేషసంఖ్యలో అబిమానులున్నారు. పవన్ కు కాపు సమాజికవర్గంలో కూడా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుకు ఓట్లేయటం ఇష్టంలేని వాళ్ళు జనసేనకు ఓట్లేసే అవకాశం కూడా ఉంది. అయితే తన అభిమానుల ఓట్లను, మద్దతుదారుల ఓట్లను, న్యూట్రల్ ఓట్లను వేయించుకునే స్ధితిలో పవన్ కల్యాణ్ ఉన్నారా ? కచ్చితంగా లేరనే చెప్పాలి. పవన్ కు ఇపుడున్న అభిమానులంతా అసంఘటితంగా ఉన్నారు.

అసంఘటితమంటే అన్ ఆర్గనైజ్డుగా ఉన్నారు. బహిరంగసభలు పెట్టినపుడు పవన్ స్పీచులకు కూడా అడ్డొస్తు సీఎం..సీఎం అంటు గట్టిగా నినాదాలు చేస్తారు. బహిరంగసభ అయిపోగానే పవన్ను మరచిపోతారు. చివరకు ఎన్నికల సమయంలో కూడా అభిమానులు జనసేనకు కాకుండా వైసీపీకే ఓట్లేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఇలాంటి అన్ ఆర్గనూజ్డు వాళ్ళ ఓట్లన్నీ తనకే పడాలని అనుకుంటే పవన్ చేయాల్సిన పనొకటుంది.

అదేమిటంటే బూత్ లెవల్ కమిటిలు, గ్రామ కమిటీలు వేయాల్సుంటుంది. బూత్ లెవల్ కమిటీల ఉపయోగం ఏమిటంటే ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు తీసుకొచ్చి ఓట్లేయించుకోవటమే. ప్రతి పార్టీకి అభిమానులు లేదా ఫిక్సుడు ఓటింగ్ ఉంటుంది. అయితే ఎంత ఫిక్సుడు ఓటింగ్ ఉన్నా వాళ్ళందరినీ పోలింగుకేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీలపైనే ఉంటుంది. ఎలాగూ పార్టీ ఓటర్లే కాబట్టి వాళ్ళే వచ్చి ఓట్లేస్తారులే అనుకుంటే దెబ్బ పడిపోతుంది.
చాలామంది ఓటర్లు తమంతట తాముగా వచ్చి ఓట్లేసేది తక్కువ. పట్టణాలు, నగరాల్లో ఓటర్లు తమంతట తాముగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త కష్టమే. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి పోలింగ్ రోజున అందరి ఇళ్ళకు వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు వచ్చేట్లు చేయాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపైనే ఉంటుంది. వాళ్ళ ఓట్లు ఏ పోలింగ్ కేంద్రాల్లో ఉంది ? పోలింగ్ కేంద్రం ఎక్కడుంది ? అనే విషయాలతో పాటు వాళ్ళ ఓటరు స్లిప్పులను తీసుకెళ్ళి ఓటర్లకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీలదే.

ఇలా ఒకటికి పదిసార్లు ఓటర్లతో బూత్ కమిటి సభ్యులు టచ్ లో ఉండటం వల్ల పలానా పార్టీకే ఓట్లేయాలనే ఆలోచన ఓటర్లలో వస్తుంది. ఆ పని ఏ పార్టీ అయితే సమర్ధవంతంగా చేస్తుందో సదరు పార్టీకి లాభం జరిగే అవకాశముంది. ఓటర్లే తమంతట తాముగా పోలింగ్ కేంద్రాలకు పరిగెత్తుకుంటు వచ్చి ఓట్లేసే పరిస్ధితి చాలా రేర్ గా వస్తుంది. ఎన్నికలకు ఉన్నది రెండేళ్ళే కాబట్టి వెంటనే పవన్ క్షేత్రస్ధాయి విషయాలపై దృష్టిపెడితే కానీ ఉపయోగముండదు. ఈ విషయంలో పవన్ ఎంతస్పీడుగా యాక్ట్ చేస్తే అంత ఫలితం ఉంటుంది లేకపోతే అంతే సంగతులు.