Health Problems : సాధారణ చాలా మందికి ఉదయం లేచింది మొదలు గొంతులో కాఫీ లేదా టీ వంటి వేడి వేడి పానీయం పడితే తప్ప రోజు గడవదు. అయితే పరగడుపున కాఫీ లేదా టీ వంటి పానీయాలు సేవించడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు సైతం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. పరగడుపున కాఫీ, టీ కి బదులు కొన్ని పదార్థాలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినా సరే ఇట్టే దూరం అవుతాయట.. కొన్ని రకాల పదార్థాలను పరగడుపున తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల ను కూడా దూరం చేసుకో వచ్చు..ఉసిరిలో మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
అంతేకాదు యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపున ఉసిరి ని తినడం వల్ల మరెన్నో ఆరోగ్యప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మీరు పరగడుపున గోరువెచ్చని నీటిలో ఉసిరి గుజ్జును కలుపుకొని తాగడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని, విటమిన్ సి కూడా శరీరానికి పుష్కలంగా లభిస్తుంది అని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఉసిరిలో చర్మ సౌందర్యానికి , శిరోజాల పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు, జుట్టుకు పటుత్వం వచ్చే అవకాశం ఉంటుంది.తేనె వల్ల మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.

పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించి శరీరంలోకి ప్రవేశించే బాక్టీరియా, వైరస్ తో పోరాడడానికి తగిన శక్తిని మన శరీరానికి అందిస్తుంది. ఇక ప్రతి రోజు తేనెని తీసుకోవడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా చర్మ కాంతి కూడా పెరుగుతుంది.ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులు, వెల్లుల్లి రెబ్బలను తేనెలో కలుపుకొని తినడం వంటి వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరిగి రోగాలు దరిచేరకుండా ఉంటాయి.