Head Stiffness : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడం సమస్య అనేది తీసుకునే ఆహారంలో పోషక ఖనిజాలు తక్కువ గా ఉండడం , దుమ్ము, ధూళి, నీటి కలుషితం, ఆహార కాలుష్యం వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. అంతేకాదు ఒత్తిడి వల్ల కూడా జుట్టు అధికంగా రాలడం , రెగ్యులర్ గా ఉపయోగించే షాంపు, నూనెలకు బదులు వేరే ప్రొడక్ట్ లు ఉపయోగించడం లాంటి కారణాల వల్ల కూడా జుట్టు అధికంగా ఊడిపోతుంది. ఇక అయితే
శిరోజాలు ధృడంగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలి అని ప్రతి ఒక్కరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందులో భాగంగానే ఇప్పుడు ఒక హెయిర్ మాస్క్ ను మీ కోసం తీసుకురావడం జరిగింది . వారానికి రెండు సార్లు కనుక మీరు తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించినట్లయితే మీరు కోరుకున్న అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతే కాదు జుట్టుకు మంచి కండిషనింగ్ గా కూడా పనిచేస్తుంది. ఇకపోతే ఆ మాస్క్ ఏమిటి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మాస్క్ కి కావలసిన పదార్థాలు:
1 స్పూన్ ఉసిరి పొడి,
1 టీస్పూన్ శీకాయ పొడి,
1 టీస్పూన్ కుంకుడుకాయ పొడి ,
2 టీస్పూన్ల నువ్వుల నూనె ,
1 టీస్పూన్ కలబంద గుజ్జు.
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉసిరి పొడి,శీకాయ పొడి,కుంకుడుకాయ పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత కలబంద గుజ్జు,నువ్వులనూనె వేసి బాగా కలిపి రెండు గంటల పాటు పక్కన ఉంచాలి.. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఉపయోగాలు : 1.ఉసిరిపొడిలో జుట్టును బలంగా చేసే పోషకాలు,విటమిన్ సి అధికంగా ఉంటాయి.
2.శీకాయ పొడిలో జుట్టు కండిషనింగ్ కి సహాయపడే విటమిన్స్ ఉంటాయి.
3.కుంకుడు కాయ పొడిలో శిలీంధ్ర వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన జుట్టు రాలకుండా సహాయపడుతుంది.
4.కలబంద జుట్టు రాలడానికి కారణమైన సమస్యను తగ్గిస్తుంది.
5.ఇక చివరిగా నువ్వులనూనె జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.