Business idea : ఇటీవల కాలంలో చాలా మంది వ్యక్తులు ఇతరులపై ఆధారపడకుండా కొంచెం రిస్క్ అయినా సరే వ్యాపారం మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.. వ్యాపారం చేయాలని ఆలోచించే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు రాయితీని అందిస్తూ లోన్ కూడా ఇవ్వడం గమనార్హం. లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్ళే దారిలో విజయం సాధిస్తున్నారు. రోజుకు రూ.4 వేల చొప్పున ఆదాయం పొందాలి అని గనక మీరు అనుకుంటున్నట్లు అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఒక వ్యాపార పద్ధతి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.ఈ వ్యాపారానికి శిక్షణ అవసరం లేదు.
పైగా నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే వీలు కూడా వుంటుంది. అదేమిటంటే కార్న్ ఫ్లేక్స్ వ్యాపారం.. ఈ వ్యాపారం మొదలు పెడితే మంచిది.. నిజానికి ఈ మధ్య చాలామంది డైట్ చేస్తున్న విషయం తెలిసిందే.. అల్పాహారం , సాయంత్రం స్నాక్స్ రూపంలో కార్న్ ఫ్లేక్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మార్కెట్లో వీటికి అధికంగా డిమాండ్ కూడా వుంది.కార్న్‌ఫ్లేక్స్ వ్యాపారం ప్రారంభించేందుకు కొన్ని యంత్రాలు, నిల్వ చేసుకునేందుకు ఒక గది కావాలి. అందుకోసం 2000 నుంచి 3000 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. మెషినరీతో పాటు విద్యుత్ సదుపాయం, ముడిసరుకును సిద్ధంగా ఉంచుకోవాలి.

మొక్కజొన్నలు బాగా పండే ప్రాంతంలో కార్న్‌ఫ్లేక్స్ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది.ఖర్చు, లాభాల విషయానికి వస్తే ఒక కేజీ కార్న్ ఫ్లేక్స్ చేయడానికి 30 రూపాయలు పడుతుంది . ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర కేజీ 70 రూపాయలు పలుకుతోంది. మీరు ప్రతిరోజు 100 కేజీలు కార్న్ ఫ్లేక్స్ తయారు చేసినట్లు అయితే మీకు రూ.7 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 3 వేల రూపాయలను ఖర్చు అనుకున్నట్లయితే.. కనీసం 4 వేల రూపాయలు కచ్చితంగా మీకు రోజుకు మిగులుతాయి. మొత్తంగా చూసుకుంటే లక్షా 20 వేల రూపాయలను మీరు లాభం కింద నెలకు పొందవచ్చు.