Arjuna Beradu : అర్జున బెరడు ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ళబెతారు..!!

Arjuna Beradu : ప్రకృతిలోని ప్రతి మొక్క మానవాళికి ఏదో విధంగా మేలు చేసేదే.. ఔషధ మొక్కల లో అర్జున బెరడు కూడా ఒకటి.. దీనిని తెల్ల మద్ది చెట్టు అని కూడా పిలుస్తారు.. అర్జున బెరడు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఏం చేస్తుందో చూడండి..!అర్జున చెట్టు బెరడులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.

ఈ చెట్టు బెరడును పాలలో వేసి మరిగించి ఆ పాలను తాగితే గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. గుండెకు సక్రమంగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. ఈ చెట్టు బెరడును దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది . శ్వాసకోశ సమస్య నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ పాలను తాగటం వలన పురుషులలో వీర్య వృద్ధి జరుగుతుంది. సంతాన సమస్యలు తగ్గుతాయి.

Health Tips In Arjuna Beradu
Health Tips In Arjuna Beradu

అర్జున బెరడు పొడి లో తేనె కలిపి తీసుకుంటే విరిగిన ఎముకలు అతికించే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. ఈ పొడిలో ఉండే కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఎముకలు దృఢంగా చేస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోగొట్టి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.