Constipation Problem : మందులు వాడకుండా మలబద్ధకం సమస్యను సహజంగా పరిష్కరించడం ఎలా..?

Constipation Problem : జీవనశైలిలో మార్పులు.. తీసుకునే ఆహారంలో పోషకాల లోపం.. ఒత్తిడి.. సరైన తిండి తినకపోవడం .. శరీరానికి అవసరమైన నీటిని తాగకపోవడం కూడా మలబద్దక సమస్యకు కారణమవుతోంది. ఇటీవల చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఇలాంటి మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మలబద్దక సమస్య చాలా సహజ పద్ధతిలో తగ్గించుకోవచ్చు. ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు అలాగే తెలిసిన వాళ్ళు ఎవరైనా మలబద్దక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ ఆర్టికల్ ను వారికి వాట్సాప్ , ఫేస్బుక్ ద్వారా షేర్ చేయగలరు.

ఇకపోతే మలబద్ధకం సమస్యను సహజ పద్ధతుల్లో తగ్గించే మార్గాలేంటి ఒకసారి తెలుసుకుందాం.ఫైబర్ అధికంగా కలిగిన కూరగాయలు , తాజా పండ్లు మలబద్దకం సమస్యను నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని చాలా సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడి..సాఫీ గా విసర్జనకు కారణమవుతాయి. ద్రవాలు ఉన్న ఆహారాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఈజీ మోషన్ అవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ప్రతిరోజు ఐదు లీటర్ల నీటిని తాగాలి. అంతకంటే తక్కువ నీటిని తాగితే శరీరంలో డీహైడ్రేషన్ అయ్యి..

constipation relief tips know here symptoms causes remedies all details
constipation relief tips know here symptoms causes remedies all details

నీరసం తో పాటు మలబద్ధకం సమస్య మరింత ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్ కారణంగా చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.ప్రతిరోజు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పళ్ల రసాలు ఎక్కువగా తాగడం.. శరీరానికి కావలసిన వ్యాయమం చేయడం.. నువ్వుల నూనెను ఉపయోగించి చేసిన వంటలు తినడం వల్ల మలబద్ధకం సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నువ్వుల నూనె తో తయారు చేసిన వంటలు లేదా నువ్వుల ఉండలు తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఇక మరొక చిట్కా ఏమిటంటే ఎండుద్రాక్ష, సునాముఖి, పటిక బెల్లం , 50 గ్రాముల చొప్పున ఒక్కొక్కటి తీసుకొని బాగా మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు కేవలం మూడు గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మలబద్దక సమస్య దూరమవుతుంది.