Health Benefits : మామిడి పూత తో రోగాలకు చెక్..ఎలా అంటారా..?

Health Benefits : వేసవి కాలం.. మామిడి పండ్లకు నెలవు.. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు తప్పకుండా తినాల్సిందే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మామిడి తో పాటు దాని టెంక, మామిడి ఆకులు, బెరడు , పువ్వులు ఇలా ప్రతిదీ కూడా మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తాయి. ఈరోజు ఈ ఆర్టికల్ ను మీరు మామిడి పూత తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునో తెలుసుకుంటారు. ముందుగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి

అసలు విషయంలోకి వెళ్తే .. మామిడిపూతతో ఎన్నో రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా మామిడి పూత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. ఎవరైనా దీర్ఘకాలిక విరేచనాలతో బాధపడుతున్నట్లయితే మామిడి పండ్ల నుంచి తయారుచేసిన డికాషన్ లేదా సూప్ తాగడం వల్ల విరేచనాల నుంచి ఉపశమనం పొందవచ్చు. మామిడి పువ్వులను ఎండబెట్టి పొడిచేసి .. నీటితో కలిపి తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ముక్కు నుంచి రక్తస్రావం కారుతున్నా..దానిని కూడా అరికడుతుంది. ఇందుకోసం మీరు మామిడి పువ్వుల వాసన చూస్తే చాలు ముక్కు నుంచి వచ్చే రక్తస్రావం కూడా ఆగిపోతుంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

Health Benefits with mango coating
Health Benefits with mango coating

మూత్రంలో మంటగా కనిపిస్తూ ఉంటే మామిడి పూత తో తయారుచేసిన కషాయాన్ని తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రనాళ సమస్యలు కూడా దూరమవుతాయి. తామర, రక్త సంబంధిత వ్యాధులు, విరేచనాలు, చర్మ రోగాలు, శారీరక సమస్యలను కూడా దూరం చేసుకోవడానికి మామిడి పూత చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక మామిడి ఆకులతో కషాయం లేదా టీ తయారు చేసుకొని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు వల్ల డయాబెటిస్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని అరికడుతుంది మామిడి పూత. కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్, అతిసారం , డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.