Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది.. ఆ ఇంటిపై కాసుల వర్షం కురిపిస్తుంది అని పండితులు చెబుతున్నారు. మరికొన్ని వస్తువులు ఎంత బాగున్నప్పటికీ వాటి వల్ల నష్టాలు తప్ప లాభాలు కలిగే ప్రసక్తే ఉండదు. అంతేకాదు వీటి వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయటకు తీసి వేయండి. మరి ఇంట్లో ఉండకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
నటరాజ విగ్రహం : ఎట్టి పరిస్థితుల్లో కూడా నృత్యం చేస్తున్నట్టు వుండే నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకూడదు. ఈ విగ్రహం పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఎక్కువయ్యి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. అంతేకాదు ఇంట్లో కలహాలు , కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి.
ముళ్ళు కలిగిన మొక్కలు: ఒక్క గులాబీ మొక్కలు, తెల్ల జిల్లేడు మొక్కలు తప్ప ఎలాంటి ముళ్ళు కలిగిన మొక్కలు కూడా ఇంట్లో పెంచరాదు. అలాగే పాలు కారే మొక్కలను కూడా ఇంట్లో పెంచారాదు.. వీటి వల్ల ఆర్థిక కష్టాలు తప్పవు.
యుద్ద చిత్రాలు: యుద్ధం జరుగుతున్నట్లు వుండే చిత్రాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం ఎక్కువ అవుతుంది. కుటుంబములో కలహాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇలాంటి చిత్రాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కష్టాలు ఎక్కువ అవుతాయి.
నీటిలో మునిగిపోతున్న పడవల ఫోటోలను, బొమ్మలను ఇంట్లో ఉంచరాదని అంటున్నారు. అవి అశుభానికి సంకేతాలు. ఇక ఆర్థిక కష్టాలు కూడా ఎక్కువవుతాయి.
అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఇక ఇలాంటి వస్తువులను ఇంట్లో నుంచి తీసేస్తే చాలు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.