Financial loss ; ప్రతి ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం. కొంతమంది వాస్తు శాస్త్రాన్ని నమ్మక పోయినప్పటికీ వాస్తు శాస్త్రం నమ్మేవారు మాత్రం ప్రతి అడుగు ప్రతి దిశ కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే ప్రతి వస్తువు కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక మనం ఏదైనా వస్తువును కానీ విగ్రహాలను కానీ సరైన ప్రదేశంలో పెట్టకపోతే డబ్బు ఉన్నా కూడా ప్రశాంతత , ఆరోగ్యం, ఆనందం లాంటివి అస్సలు ఉండవు. అంతే కాదు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
వాస్తు శాస్త్రానికి సైన్స్ కి కూడా చాలా దగ్గరి సంబంధం ఉంది.ఇకపోతే మీ ఇంట్లో గోడలకు మార్కెట్లో దొరికే కొన్ని చిత్రపటాలను అందంగా ఉన్నాయి కదా అని తీసుకువచ్చి పెట్టారు అంటే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నియమాలను ఏ విధంగా పాటించాలి. ఇలాంటి ఫోటోలను గోడకు తగిలించాలి అనే విషయాలను కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం సింహ ద్వారం ఎదురుగా చనిపోయిన వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తగిలించకూడదు.. అలాగే సింహ ద్వారం ఎదురుగా గణపతి విగ్రహాన్ని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూల మొక్కలు,జంతువులు,మహాభారత,యుద్ధ చిత్రాలు, తాజ్ మహల్ వంటి ఫోటోలను ఉంచకండి.
వాళ్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువై వ్యక్తి అపజయం వైపు అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే పరాజయం పొందుతామో ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది పైగా ఆర్థిక సంక్షోభంలో మునిగి పోతారు.వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయం వైపు ఉండడం ఉత్తమం. ఈ దిశలో నిర్మించడమే కాకుండా వంట చేసేటప్పుడు మీ ముఖాన్ని తూర్పువైపున ఉంచాలి.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం.. ప్రతి రోజు నిత్య దీపారాధన చేస్తూ ఉండడం.. విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఫోటో పక్కన ఉంచి ప్రతిరోజు పూజించడం లాంటివి చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోయి సంపద పెరుగుతుంది.