Chanakya Niti : మహాగురువు ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఆచార్య చాణుక్య ఎన్నో విషయాలను మనుషుల కోసం నీతి శాస్త్రంలో లిఖించడం జరిగింది. ఇక ఇందులో లిఖించబడిన ప్రతీ వాక్యమూ కూడా మనిషి జీవన మనుగడకు ఎంతో సహాయ పడతాయి. ముఖ్యంగా మనము ఎలా ఉండాలి.. ఎవరితో ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి.. అని ప్రతి విషయాన్ని కూడా నీతి శాస్త్రంలో కచ్చితంగా పేర్కొనడం గమనార్హం. చాణిక్యుడు చెప్పినట్టుగానే ఇలాంటి వారితో మన స్నేహం చేసినట్లయితే మట్టి , రాళ్ళు కూడా బంగారంగా మారిపోతాయట. మరి అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు..?
వారితో స్నేహం ఎలా చేయడం..? ఇలా అన్ని పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..చాణిక్య నీతి ప్రకారం సమాజంలో కొన్ని వర్గాల వారికి ప్రత్యేకమైన గౌరవం లభిస్తూ ఉంటుంది. ఇక మరికొంతమంది మట్టిని ముట్టుకున్నా లేదా రాళ్లను తాకిన బంగారంగా మారిపోతూ ఉంటాయి. వీరిని అదృష్టవంతులు అని పరిగణిస్తారు. అయితే అలాంటివారు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.. అలా మారాలి అంటే మనం కూడా ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల ఎల్లప్పుడూ మంచి భావాలను కలిగి ఉండే వ్యక్తులు..
ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలు కలిగి ఉంటారు. వారి జీవితంలో కొన్ని కష్టాలు కూడా వాటికవే తగ్గిపోతాయి. అలాంటి వారి జీవితంలో అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా డబ్బు కూడా అధికంగా సంపాదిస్తారు .ఇక జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవిస్తారు.దానధర్మాలను కూడా ముఖ్యమని భావించే వ్యక్తులు సమాజం పట్ల తన బాధ్యతను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వారి అదృష్టం ఎప్పుడు వారికి అండగా నిలుస్తుంది .ఇక ఇలాంటి వ్యక్తులు ఏ పని చేసినా.. ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టినా భగవంతుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. తప్పకుండా జీవితంలో ధనవంతులు అవుతారు.