Cardamom : ఆ సమయంలో 2 యాలకులు తింటే..?

Cardamom : భారతీయ హిందూ శాస్త్రం ప్రకారం సుగంధ ద్రవ్యాలలో యాలకులు ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకున్నాయి. మంచి సువాసనను అందించడమే కాదు రుచిని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఇక సుగంధ ద్రవ్యాలలో అత్యంత సువాసన అందించే వస్తువులలో యాలకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మసాల దినుసుగా ఉపయోగించే యాలకులను మౌత్ ఫ్రెషనర్ గా కూడా వాడుతుంటారు. అంతే కాదు టీ తయారు చేయడంలో కూడా యాలకులను ఉపయోగిస్తారు. యాలకులను రాత్రి నిద్రించే ముందు రెండు నోట్లో వేసుకుంటే చాలు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి యాలకులు చాలా బాగా పనిచేస్తాయి. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలు లభిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తాయి.. కడుపు సంబంధిత వ్యాధుల నివారణకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి. అంతే కాదు యాలకులలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ,క్యాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీర బరువును నియంత్రించడంలో.. అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయ పడుతూ..దగ్గు ,జలుబు , ఆస్త్మా , జీర్ణ సంబంధ సమస్యలను కూడా ఈ యాలకులు దూరం చేస్తాయి.

Health Benefits with Cardamom
Health Benefits with Cardamom

యాలకుల లో ఉండే కొన్ని రకాల పోషకాలు వల్ల రక్తపోటు సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. స్మోకింగ్ అలవాటు ఉండేవారు ప్రతిరోజు యాలకుల్ని నోట్లో వేసుకోవడం వల్ల ఈ అలవాటు ఇట్టే దూరమవుతుంది. అంతేకాదు శరీరంలో అధిక మొత్తంలో ఐరన్ అందించడానికి యాలకులు బాగా పనిచేస్తాయి. బీపీని అదుపులో ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. ప్రతిరోజు భోజనం పూర్తయిన తర్వాత రాత్రి సమయంలో నిద్రకు ముందు రెండు యాలకుల ను తిని ఒక గ్లాసు నీటిని తాగితే ఈ ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు కూడా దూరమవుతాయి.