According Science : శాస్త్రం ప్రకారం కాళ్లకు నల్ల దారాన్ని ఎందుకు కట్టుకుంటారు..!!

According Science : ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువతీ,యువకులు తమ కాళ్ళకి లేకుంటే మెడకి నల్లటి దారాలను కట్టుకోవడం మనం చూసే ఉంటాము. అయితే కేవలం నల్ల దారం ఎందుకు ఉపయోగించుకోవాలి వాటి గురించి విశిష్టత ఏంటో మన పురాణాలు,శాస్త్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.ఒకప్పుడు ఆచారాలు గా ఉండేవి ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా మారిపోయాయి. అప్పట్లో కాళ్ళకు గజ్జలు వేసుకునేవారు ఇప్పుడు అవి కాస్త పట్టీలుగా మారిపోయి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటివల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి.

అయితే అప్పట్లో కూడా పట్టిల కంటే ముందు ఎక్కువగా స్త్రీలు నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఇది ఒక స్టైల్ గా మారిపోయింది. అయితే ఇది చాలా అందంగా కనిపించడం తో ఎక్కువగా యూత్ వీటిని ఇష్టపడుతున్నారు.అయితే జ్యోతిష్యం, శాస్త్రం ప్రకారం ఈ నల్ల దారం అందరికీ సెట్ కాదట. ఈ దారాన్ని ఎవరు పడితే వారు వాడుకో కూడదట. ఈ నల్ల దారం వాడుకునేందుకు కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. వాటిని బ్రేక్ చేస్తే జీవితంలో ఎదగడం కష్టంగా ఉంటుందట. సాధారణంగా నలుపు రంగు అంటే ఎక్కువగా శనీశ్వరుడు అని అర్థము. ఇలాంటి నల్లని దారాన్ని కట్టేటప్పుడు శనిదేవుని నమస్కరించి..

According to science why black thread is tied to the legs
According to science why black thread is tied to the legs

ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజులు మాత్రమే కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడి నుండి మనం అనుగ్రహం పొందితే మనకి పట్టిన శని విముక్తి కలుగుతుంది.అయితే వీటిని స్త్రీలు ఎడమ కాలికి, పురుషులు కుడి కాడికి మాత్రమే కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వారికి తగిలిన చెడు పోయి శక్తిని నిరోధించే సామర్థ్యం ఈ నల్లటి దారానికి ఉన్నదని పూర్వీకుల నమ్మకం. అందుచేత తల్లిదండ్రులు ఎక్కువగా ఈ నల్లటి దారాన్ని పిల్లలకి కడుతూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా చేతికి నారింజ, పసుపు, ఎరుపు రంగు దారాలను ధరించి ఉంటారు వారు నల్ల దారాన్ని ధరించకూడదు అని శాస్త్రం ప్రకారం పండితులు తెలియజేయడం జరిగింది.