Lakshmi Devi : శుక్రవారం రోజునే లక్ష్మీదేవి కి ఎందుకు పూజ చేయాలో తెలుసా..?

Lakshmi Devi : ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అంటే కచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి భక్తితో పూజ చేయాలని పండితులు చెబుతుంటారు . అయితే ఎందుకు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే అంత ఇష్టమో.. అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే రాక్షసులు అందరికీ ఒక గురువు ఉండేవారట. ఆ గురువు పేరు శుక్రాచార్యుడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు వచ్చింది అని పురాణాలు తెలిసిన పండితులు చెబుతున్నారు. ఇక శుక్రాచార్యుడి తండ్రి పేరు భ్రుగుమహర్షి.

ఈయనని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు గా చెబుతారు. లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు . కాబట్టే అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైనది అని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాదు రాక్షసులకు కూడా తమ గురువు కి సోదరి అయిన లక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి ఉండేది అని చెబుతూ ఉంటారు. ఇక అలా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శుక్రవారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు ప్రసన్నం అయి.. భక్తుల భక్తికి మెచ్చి కోరిన కోరికలు తీరుస్తుంది అనే బలమైన విశ్వాసం భక్తుల లో ఉండిపోయింది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి సులభమైన మార్గం కేవలం శుక్రవారమే అని ఆ రోజు కనుక ఆమెను భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది

Do you know why Lakshmi Devi should be worshiped on Friday
Do you know why Lakshmi Devi should be worshiped on Friday

అని పురాణాలు చెబుతున్నాయి.లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం కూడా శుక్రవారమే నిర్వహిస్తారు. ఇకపోతే లక్ష్మీదేవి చేతిలో ఒక ఒక పద్మం మొగ్గ రూపంలో ఎందుకు ఉంటుంది అంటే.. సౌందర్యానికి.. నిర్మలతకు సంకేతం అది. పద్మం అనగా తామర పువ్వు ఇది బురద నుంచి పడుతుంది కాబట్టి ఏ వాతావరణంలోనైనా వికసించే అపరిమితమైన శక్తి ఈ పువ్వు కు ఉంటుంది. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది కాబట్టి ఇది జీవానికి సంకేతం. అంతేకాదు నిత్య ప్రవాహ శీలై ఈ నీరు ఉంటుంది ఒకవేళ అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. నీటి లాగే ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ధనం విలువ, నీటి విలువ తెలియదో అప్పుడు జీవితం విలువ కూడా తెలియదు అని చెబుతారు పెద్దలు.