Pariki Kampa : ఈ చెట్టుని ఎప్పుడైనా చూశారా.!? తల మొదలు కాళ్ల సమస్యల వరకు సంజీవని..!

Pariki Kampa : పరికి చెట్టుని మనలో చాలా మంది చూసే ఉంటారు.. ఈ చెట్టు కాయలు చిన్న రేగి పండు లాగా ఉంటాయి.. ఈ చెట్లు పొలాల గట్ల వైపు ఎక్కువగా కనిపిస్తాయి.. చిన్న బఠానీ గింజలలా ఉండే ఈ కాయలు పులుపు, తీయని రుచి కలిగి ఉంటాయి..! ఈ పండ్లలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి..!పరిక కాయలు తరచుగా తింటుంటే తలనొప్పి రాదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కాయలను విత్తనాలతో సహ తినవచ్చు.

ఈ కాయలు తింటే నరాల వ్యాధులు రాకుండా చేస్తాయి. తల నుంచి కాళ్ల వరకూ ఎటువంటి నొప్పులు అయినా తగ్గించే శక్తి ఈ కాయలకు ఉంటుంది. పరికి కాయలలో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. పరికి కాయలు నమిలి తింటే గొంతు నొప్పి ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.వారికి చెట్టు ఆకులను దంచి ముద్దగా నూరి కొని ఈ పుండ్లు గాయాలు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి.

Health Benefits of Pariki Kampa
Health Benefits of Pariki Kampa

అలాగే గజ్జి , తామర, దురద ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాస్తే చర్మ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకుల కషాయం నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి దంత సమస్యలను నివారిస్తుంది. ఈ చెట్టు బెరడు ను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఈ పొడిని వేసి కషాయం లో తయారు చేసుకుని తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. ఈ బెరడు కషాయం సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది.