Sprouted Seeds : మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..!!

Sprouted Seeds : ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు . అందులో భాగంగానే మొలకెత్తిన గింజలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో తయారు చేసుకో లేనివారు బయట మార్కెట్లో కొన్ని వందల రూపాయలు వెచ్చించి మరీ తీసుకోవడం గమనార్హం. మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరానికి కావలసినటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అయితే మొలకెత్తిన గింజలను తినేటప్పుడు కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో చాలా మందికి మొలకెత్తిన విత్తనాలు తినడానికి కూడా సమయం లేదు.. అందుకే వాటిని జ్యూస్ రూపంలో చేసి తాగేస్తున్నారు. ఇలా జ్యూస్ రూపంలో తాగడం వల్ల అందులోని పూర్తి పోషకాలు శరీరానికి అందవు. నిజానికి మొలకెత్తిన గింజలను నమలడం వల్ల నోటిలో ఊరే లాలాజలం వాటితో కలిసి శరీరంలోకి వెళ్లి ..ఆ విత్తనాల లోని కార్బోహైడ్రేట్లు పూర్తిస్థాయిలో జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు జ్యూస్ రూపంలో తాగినట్లయితే నోట్లో లాలాజలం ఊరక.. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కూడా అంతంత మాత్రమే లభిస్తాయి.ముఖ్యంగా మనం మొలకెత్తిన గింజలను ఏవి తినాలి అంటే పెసలు..

Things to keep in mind while eating sprouted seeds
Things to keep in mind while eating sprouted seeds

సజ్జలు.. రాగులు.. అలసందలు.. మొదలైన గింజలను మొలకెత్తించి తినవచ్చు. కొంతమందికి ఉట్టి మొలకెత్తిన గింజలు మాత్రమే తినాలి అంటే పెద్దగా సహించదు. అలాంటప్పుడు వీటితోపాటుగా దానిమ్మ గింజలు, ఖర్జూర , ద్రాక్ష, ఉల్లిపాయముక్కలు లాంటివి వేసుకొని తినడం వల్ల పోషకాలు కూడా లభిస్తాయి. అంతేకాదు ఉప్పు, నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుని తిన్నా కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం అల్పాహారం సమయంలో మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించి రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాదు భోజనంతోపాటు వీటిని తీసుకోకుండా ఒక పూట భోజనం.. ఒక పూట మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది.