mulla Gorintaఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి లక్షలు పోసిన నయం కానీ జబ్బులకు ఇది పరిష్కారం..

mulla Gorinta : నిత్యం మన చుట్టూ పక్కల అనేక రకాల పూల మొక్కలను చూస్తుంటాం.. ఈ పూల మొక్కలలోను అనేక ఔషధ గుణాలు ఉంటాయి.. అందులో ముళ్ళ గోరింట కూడా ఒకటి.. ముళ్ళ గోరింట, తేనె పువ్వుల చెట్టు, వజ్ర దంతి, డిసెంబర్లా చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ ముళ్ళ గోరింట కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం..

ముళ్ళ గోరింట వేర్లతో పళ్లు తోమడం వలన పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి.. అందుకే దీనిని సంస్కృతంలో వజ్రదంతి అంటారు.. ఇంకా దంత సమస్యలను నయం చేస్తుంది. ఈ చెట్టు ఆకులకు ఉప్పు కలిపి మెత్తగా చేసి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే దంతాలపై ఉన్న గారా, పసుపు, పాచ్చి పోతాయి. దంతాలు తెల్లగా మిలమిల మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల పంటి సమస్యలను నివారిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముళ్ళ గోరింట అన్ని రకాల దంత సమస్యలను నయం చేస్తుంది.

ఈ ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేచి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడగట్టుకుని నీటితో నోరు పుక్కిలించి ఉసేస్తే నోటి దుర్వాసన పోతుంది. మౌత్ అల్సర్ ను తగ్గిస్తుంది. ఇది చక్కటి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఈ బేరడు పొడితో పళ్ళు తోముకుంటే పంటి మీద పసుపు పచ్చదనం పోయి మిల మిల మెరిసి పోతాయి. ఆకుల రసం తేనే కలిపి తీసుకోవడం వలన నోటి పూత, నోటి దుర్వాసన ను తగ్గిస్తుంది

ఈ చెట్టు బెరడు ను సేకరించి దంచి పొడి చేసుకోవాలి. ప్రతి రోజూ ఒక చెంచా పొడిని తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు, శరీర, కండరాలు నొప్పులు తగ్గుతాయి. ఈ పొడిని ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ చెట్టు బెరడు అద్భుతంగా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

ఈ చెట్టు ఆకులను సేకరించి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలో నొప్పులు ఉన్నచోట మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నచోట కట్టుగా కట్టి ఉదయం ఆ కట్టు తీసి వేస్తే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి. అలాగే శరీరంపై ఉన్న వాపులను కూడా తగ్గిస్తుంది. మొక్కలు చాలా ఆయుర్వేద ఔషధగుణాలు ఉన్నప్పటికీ ఈ ఆకుల రసాన్ని 50 – 100 ML మించి తీసుకోకూడదు.