YSR Law Nestham: కొత్త వకీల్ కు ప్రతినెలా రూ.5000 పింఛన్..!

YSR Law Nestham.. న్యాయ శాస్త్రం పట్టా చేత పట్టుకొని న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన కొత్త లాయర్ల వృత్తి గత జీవితం కాస్త గందరగోళంగానే కనిపిస్తుంది. వారు ఏదో ఒక సీనియర్ న్యాయవాది వద్ద జూనియర్ గా చేరాలి . కొన్ని సంవత్సరాలు పైసా సంపాదన లేకుండా వృత్తిలో అనుభవం పొంది తర్వాత తామే సొంతంగా కేసులు వాదించే స్థాయికి చేరుకోవాలి. కేసులు గెలిచి మంచి పేరు తెచ్చుకున్నప్పుడే ఆ లాయర్ దశ తిరుగుతుంది.

Andhra CM Jagan Mohan Reddy launches YSR LAW Nestham

అప్పటివరకు కొత్తగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన యువ న్యాయవాదులకు వృత్తి గత జీవితం విషమ పరీక్ష గానే ఉంటుంది. న్యాయ కళాశాలలో చదివే చదువు వేరు న్యాయ శాస్త్రాల్లో అడుగుపెట్టాక చదవాల్సింది.. నేర్చుకోవాల్సింది బోలెడు. దీనికోసం ఎన్నో పుస్తకాలు చదవాలి.. వాటిని కొనాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది. జూనియర్ లాయర్లకు ఇబ్బందిగా మారుతోంది. అయితే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది . దీని కింద యువ న్యాయవాదులకు ప్రతినెల రూ.5000 ఇస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద గత మూడేళ్లలో 4,248 మంది న్యాయవాదుల ఖాతాల్లో రూ.35.40 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కూడా 2011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి పింఛన్ జమ చేశారు.