Health Benefits : కదంబం పూల ప్రత్యేకత తెలుసా.. ఆశ్చర్యపోయే నిజాలు..!

Health Benefits : కదంబ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు.. ఈ చెట్టును కడిమి అని కూడా పిలుస్తారు.. అయితే ఈ చెట్టులో ఉన్న ఔషధ గుణాల గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.. కదంబం పువ్వులను దేవతారాధనకు ఉపయోగిస్తారు. విశేషంగా ఈ పూలతో లలితాదేవికి పూజిస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.. ఈ చెట్టు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దూదిపించెలా ఎగిరిపోతాయో ఇప్పుడు చూద్దాం..!కదంబం చెట్టు పండ్ల లో అనేక రకాలైన ఆల్కలాయిడ్స్ గుణాలు ఉన్నాయి. ఈ పండ్లు ఫుడ్ పాయిజన్ కు చెక్ పెడతాయి.

వరుసగా పదిహేను రోజుల పాటు ఈ చెట్టు పండ్లను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే.. ఫుడ్ పాయిజన్ నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఈ పండ్లను తరచూ తీసుకుంటే బాలింతలలో పాలను వృద్ధి చెందేలా చేస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ముసలి వారు ఈ పండ్లను తీసుకుంటే అలసట, నీరసం, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తాయి.కదంబం చెట్టు బెరడు పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

Health Benefits of Kadambam plant flowers
Health Benefits of Kadambam plant flowers

ఈ చెట్టు బెరడు పొడిలో జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజన్ సమస్యనుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ చెట్టు బెరడు కషాయం తయారుచేసుకొని తాగితే మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్స్ వంటి మూత్ర సంబంధిత సమస్యలకు సమస్యలు తొలగిపోతాయి. ఈ చెట్టు ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు నయమవుతాయి. ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి కొని ఆ మిశ్రమాన్ని గాయాలుు, పుండ్లు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఈ చెట్టు ఆకుల కషాయం తాగితే రుతు సంబంధిత దోషాలు తొలగిస్తుంది.