Beauty Benefits : అందానికి ఈ ఆయిల్ బెస్ట్.. రిజల్ట్ సూపర్..

Beauty Benefits : ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నా నూనెలలో రోజ్ మేరీ ఆయిల్ కూడా ఒకటి.. ఈ నూనె సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.. ఈ ఎసెన్షియల్ ఆయిల్ చర్మాన్ని యవవనంగా ఉంచడంతోపాటు.. అతినీలలోహిత కిరణాల తాకిడికి గురికాకుండా చేస్తుంది..!రోజ్ మేరీ ఆయిల్ రాసుకోవడం వలన చర్మం అందంగా మెరిసిపోతుంది.

ఈ నూనెలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు రాకుండా చేస్తాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ నూనె రాసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. చర్మాన్ని బిగుతుగా, మృదువుగా చేస్తుంది. ఇంకా చర్మంపై పేరుకొన్న మురికి, జిడ్డు వంటి వాటిని తొలగిస్తుంది.రోజ్ మేరీ ఆయిల్ ను మనం సన్ స్క్రీన్ లోషన్ గా వాడుకోవచ్చు.

Beauty benefits of Rosemary Oil
Beauty benefits of Rosemary Oil

రోజ్ మేరీ నూనె లో తేనె, పెరుగు కలిపి రాసుకుంటే ఈ మిశ్రమం సన్ స్క్రీన్ లోషన్ గా పనిచేస్తుంది. ఎండ వలన పేరుకుపోయిన ట్యాన్ ను వదిలిస్తుంది. కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు కూడా ఈ ఆయిల్ పోగొడుతుంది. మీరు డార్క్ సర్కిల్స్ కు ఉపయోగించే ఐ క్రీమ్ లో కొన్ని చుక్కలు రోజ్ మేరీ నూనెను వేసి ఐదు నిమిషాల పాటు మర్ధనా చేయాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.