Zodiac Signs : తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఇలా చేయకండి..!!

Zodiac Signs : హిందూ సాంప్రదాయం ప్రకారం.. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక ప్రత్యేక దేవతను పూజిస్తూ ఉంటారు. ఇక సోమవారం శివుడికి .. మంగళవారం హనుమంతుడికి.. బుధవారం గణపతికి.. గురువారం సాయిబాబా కి.. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి.. శనివారం రోజున శని దేవుడికి అలాగే విష్ణువు కి సంబంధించిన రోజులుగా పరిగణిస్తారు. ఇక ఆదివారం రోజు సూర్య భగవానుడు కి సంబంధించిన రోజుగా పరిగణించబడడం గమనార్హం. ఇక ఆదివారం సెలవు కావడంతో చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆదివారం రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అలా చేయడం వల్ల సూర్యభగవానుడికి కోపం వస్తుంది అని..

మనపై ఆయన దృష్టి పడుతుంది అని చాలా మంది చెబుతున్నారు. ఇకపోతే జ్యోతిష్యం ప్రకారం ఆదివారం ఏ పనులు చేయకూడదో ఒకసారి తెలుసుకుందాం. ఇక ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన మాంసాహారాన్ని కేవలం ఆదివారం రోజు మాత్రమే వండుకొని తింటుంటారు. కానీ ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం, మద్యం సేవించకూడదు. అలా చేస్తే ఇంటిలో పెద్ద వారి పురోగతికి ఆటంకం కలుగుతుందట. ఇక ఆదివారం రోజు సూర్యభగవానుడికి ముదురు రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదు. అది కూడా నలుపు, నీలం, బూడిద వంటి రంగులను అసలుకే ధరించరాదు.

Zodiac Signs Be careful Do not do this on that day under any circumstances
 Zodiac Signs Be careful Do not do this on that day under any circumstances

ఇక ప్రతిరోజూ ఉదయం పూట తులసి మొక్కలకు నీళ్లు పోయడం మంచిదే.. కానీ ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసికి నీళ్లు పోయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పురాణాల ప్రకారం ఆదివారం రోజున తల్లి తులసి వ్రతంగా భావిస్తారు కాబట్టి.చాలామందికి ఆదివారం రోజు మాత్రమే అన్ని పనులు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. కాబట్టి ఆ వేళలో జుట్టు కూడా కత్తిరించు కుంటూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదట. ఇక ఆదివారం రోజు జుట్టు కత్తిరిస్తే మీ పనులలో ఆటంకం కలుగుతుందని సమాచారం. అంతేకాదు ఆదివారం రోజు సూర్యాస్తమయం తర్వాత ఉప్పు తినడం కూడా మంచిది కాదు.