Health Benefits : జామకాయ లాభాలు తెలిస్తే అస్సలు వదులరు..!!

Health Benefits : సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో విరివిగా లభించే పండ్లలో జామకాయ కూడా ఒకటి. నిజానికి ఒక జామకాయ తింటే చాలు 10 ఆపిల్ పండ్ల తో సమానం అని వైద్యులు చెబుతున్నారు. ఇక జామ కాయ తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. అన్ని సీజన్ లలో విరివిగా లభించే జామ కాయలలో ఎక్కువ పోషకాలు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది. ముఖ్యంగా జామకాయలను ఎక్కువగా తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

ఇకపోతే జామకాయలు ప్రతి ఒక్కరికీ విరివిగా లభిస్తాయి కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేసి జామకాయ ప్రయోజనాలను తెలపవచ్చు.జామకాయలో దాగివున్న పోషకాల విషయానికి వస్తే.. ఐరన్ , ఫోలిక్ యాసిడ్ , పొటాషియం, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఎ , ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.. ముఖ్యంగా వేసవి కాలంలో జామ కాయలు తినడం వల్ల అధిక దప్పిక వేసే వారికి మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. ఇక ఎవరైతే దప్పిక తో బాధ పడుతున్నారో అలాంటివారు

 health benefits of guava it prevents thyroid
health benefits of guava it prevents thyroid

చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి రెండు గంటల తర్వాత ఆ నీటిని తాగినట్లైతే దప్పిక తీరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే జామకాయ తినడం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి.ఇక అరటిపండులో కన్నా ఎక్కువగా పొటాషియం జామ పండ్లలో లభిస్తుంది. అంతేకాదు చిగుళ్ళు , దంతాలు కూడా గట్టిపడతాయి. దంతాల నుంచి వచ్చే రక్తస్రావం ఆగిపోవడమే కాదు ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. మధుమేహం వారికి చక్కటి ఆహారం అని చెప్పవచ్చు.