Makeup : మేకప్ వేసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Makeup : ఇటీవల కాలంలో చాలా మంది అందంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటున్నారు. నిజానికి మేకప్ పుణ్యమా అని ముఖం పైన వచ్చే మచ్చలు , ముడతలు, మొటిమలు ఇలా అన్నింటినీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇటీవల కాలంలో మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి మేకప్ వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే మీ ఇంట్లో అక్క, చెల్లి , వదిన, భార్య ఇలా ఎవరైనా సరే మేకప్ వేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ముందు జాగ్రత్తగా ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.

మీరు మేకప్ వేసుకోవడానికి ముందుగా మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకున్న తరువాతనే మేకప్ వేసుకోవడం మంచిది. మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల మేకప్ తాలూకా కెమికల్స్ చర్మానికి హాని చేయవు. మీరు మేకప్ ఉత్పత్తులను ఎంచుకునేటప్పుడు మీ చర్మానికి సరిపోయే బ్యూటీ ప్రొడక్ట్స్ ను మాత్రమే ఎంచుకోవాలి. మొదటిసారి మీరు మేకప్ వేసుకుంటున్నట్లూ అయితే ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ మీ చర్మానికి సెట్ అవుతుందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇందుకోసం ఈ ప్రోడక్ట్ లను మీరు చేతుల పైన అప్లై చేసుకొని పరీక్షించవచ్చు.

Are you wearing makeup but these precautions are mandatory
Are you wearing makeup but these precautions are mandatory

కళ్ళకు వేసుకొనే మేకప్ విషయంలో కూడా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కళ్ళకు ఉపయోగించే ప్రొడక్ట్స్ కారణంగా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కంటి సమస్యలు కనుక ఏర్పడినట్లయితే వెంటనే నీళ్లతో శుభ్రపరచుకోవాలి. తర్వాత పచ్చి పాలలో ముంచిన దూదితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక గడువు అయిపోయిన ఉత్పత్తులను అసలు ఉపయోగించకూడదు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే మేకప్ వేసుకున్నా మీ చర్మానికి ఎటువంటి హాని కలగదు.