Health Benefits : అనందయ్య ఉపయోగించిన ఈ తీగ మొక్క గురించి మీకు తెలుసా..!?

Health Benefits : గాజు తీగ చెట్టును మన రోజూ చూస్తూనే ఉంటాం.. ఆనందయ్య తయారు చేసిన కరోనా మందులో కూడా తీగ ను ఉపయోగించారంటే.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. దీనినే తెల్ల జుంకి, బంగారు తీగ, బుట్ట బుడాస చెట్టు అని కూడా అంటారు.. ఈ చెట్టు ఆకులలోనే కాదు కాయలలో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఈ చెట్టు కాయలు బాగా పండిన తరువాత మాత్రమే తినాలి. పచ్చగా ఉండే ఈ చెట్టు కాయలు తినకూడదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు పండిన కాయలలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ కాయలు తినడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. తలనొప్పికి ఈ చెట్టు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని నుదిటి పైన రాస్తే త్వరగా తలనొప్పి తగ్గుతుంది.
ఈ ఆకుల మిశ్రమాన్ని పాము కాటు వలన కలిగిన గాయాన్ని మాన్పడానికి ఉపయోగిస్తారు.

Health Benefits of Gaju Teega plant
Health Benefits of Gaju Teega plant

ఈ చెట్టు ఆకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.. అతిసార వ్యాధికి ఆకులు ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు కాలం నుంచి తయారుచేసిన రసాన్ని స్త్రీల సంతానోత్పత్తి సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. అస్తమా తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చెట్టు ఆకులతో కషాయం తయారుచేసుకొని తాగితే నిద్రలేమి సమస్య కు చెక్ పెట్టవచ్చు. కంటి నిండా నిద్ర పొకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని గమనించాలి. ఊపిరితిత్తులలో నిమ్ము, జలుబు, దగ్గు , కఫం కి ఈ ఆకుల కషాయం పనిచేస్తుంది.