Health Problems : అలర్జీతో తుమ్ములు, ముక్కు కారడం లాంటి సమస్యలు ఎక్కువ అయ్యాయా..?

Health Problems : సాధారణంగా కొంత మందికి అలర్జీలు ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. వీరు కొంచెం దుమ్ము , ధూళికి తిరిగారు అంటే చాలు తుమ్ములు, ముక్కు కారడం , దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి. గాలి కాలంలో ఇలాంటి అలర్జీలకు మరీ ఎక్కువగా గురి అవుతారు.. ఎందుకంటే వాతావరణంలో మార్పులు, పీల్చేగాలిలో కాలుష్యం వంటి కారణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి అలర్జీలను దూరం చేసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది . మనం జాగ్రత్తలు తెలుసుకునే ముందుగా అలర్జీ రావడానికి గల కారణాలు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం.

మీకు తెలిసిన వారెవరైనా అలర్జీ సమస్యలతో బాధపడుతున్నట్లైతే అవగాహన కోసం వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.ముందుగా మనకు అలర్జీని తీసుకువచ్చే కారకాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. దుమ్ము.. పెంపుడు జంతువుల నుండి వచ్చే చుండ్రు, దుమ్ము పురుగులు, ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటి వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలర్జీలు వచ్చినప్పుడు ముక్కు, కంటి నుండి నీరు కారడం , దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. చర్మం దద్దుర్లు, గొంతులో మంట , ముఖం మొత్తం ఎర్రగా మారి పోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

Health Problems in Sneezing and runny nose with allergies
Health Problems in Sneezing and runny nose with allergies

ఇటీవల కాలంలో చాలామంది పెంపుడు కుక్కలను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి వాటితో సమయాన్ని గడుపుతూ ఉంటారు . అలా కూడా మనకు అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.ఇక అలర్జీలను దూరం చేయడానికి మనం పాటించాల్సిన నియమాలు ఏమిటంటే .. పెంపుడు కుక్కలకు తరచూ బ్రష్ చేయడం, స్నానం చేయించడం లాంటివి చేయాలి. అలాగే కిటికీలు, తలుపులు దగ్గర ఉన్న దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో వస్తువులను శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా ముక్కుకు, నోటికి మాస్కు ధరించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే అలర్జీల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.