Kidney Stones : ఇది తాగారంటే కిడ్నీలో కంకరరాళ్లు ఉన్న కరిగిపోతాయి..!

Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారి బాధ వర్ణనాతీతం.. కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు నడుము నొప్పితో విపరీతమైన బాధను భరిస్తారు. అలాగే మూత్రంలో మంట కూడా ఉంటుంది.. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య వస్తుంది. లేదంటే అంతకుముందు మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ మందుల కారణంగా కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి.. మనం తీసుకునే ఆహారం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి.. స్త్రీలతో పోల్చుకుంటూ పురుషులు ఎక్కువగా ఈ సమస్య బారిన పడతారు..

ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇప్పుడు మనం చెప్పుకునే కషాయం తయారుచేసుకొని తాగితే చాలు..!ఈ చిట్కా కోసం 15 తులసి ఆకులు, ఒక చెంచా తేనె అవసరం. ముందుగా తులసి ఆకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి వేసుకోవాలి. అందులో ఒక గ్లాసు నీటిని పోసి మరిగించాలి. అరగ్లాసు నీరు అయ్యేవరకు మరిగించిన తరువాత ఆ నీటిని మరో గ్లాసులోకి వడపోసుకోవాలి. ఈ నీటిలో ఒక చెంచా తేనెను కలపాలి. ఈ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పరగడుపున తాగాలి.

These Herbal Drink To Check Kidney Stones
These Herbal Drink To Check Kidney Stones

ఇలా ప్రతి రోజూ తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే వాటిని కరిగించి మూత్రం ద్వారా బయటకు నెట్టివేస్తుంది.తులసి ఆకులలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి కిడ్నీలో రాళ్ళను కరిగించడం తో పాటు గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు తాగడం వలన నిత్య యవ్వనంగా కనిపిస్తారు. చర్మం ముడతలు పడకుండా మెరిసిపోతుంది.