Health Benefits : మునగ ఆకులతో ప్రయోజనాలెన్నో.. తెలిస్తే షాక్..!!

Health Benefits : ప్రకృతి అందించే ఎన్నో రకాల పోషకాలు కలిగిన మొక్కలలో మునగ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ద్వారా లభించే ఆకులు.. ఆకుల ద్వారా లభించే పొడి రెండూ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఇకపోతే మునగ కాయలు కూడా సంతాన సాఫల్యాన్ని పెంచడానికి సహాయపడతాయి అని.. శృం.. సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇకపోతే మునగ ఆకుల లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ,కంటిచూపుకి సహాయపడతాయి. ముఖ్యంగా మునగ ఆకుల లో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకల సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. అందుకే కనీసం వారానికి రెండుసార్లు అయినా కచ్చితంగా మీ ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు..పల్లెటూర్లలో అయితే మునగ చెట్ల కు కొదవే ఉండదు. కానీ సిటీలలో చెట్లను పెంచుకోవడానికి స్థలం కూడా చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో మునగాకు దొరకడం కష్టంగా మారింది.

ఇక అలాంటి వారికి మునగ ఆకులను ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని మార్కెట్లలో విక్రయిస్తున్నారు. తాజాగా సైంటిస్టులు వెల్లడించిన సమాచారం ప్రకారం మునగ ఆకు పొడి లో కూడా అద్భుతమైన పోషకాలు ఉన్నాయని పరిశోధనలు చేసి మరీ తెలిపారు. ఇకపోతే మునగ ఆకు వల్ల ఆరోగ్యానికి ఏవిధంగా లాభం చేకూరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.ప్రతి రోజూ 15 నుండి 20 గ్రాముల మునగాకు పొడి తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ దాదాపు 30 శాతం తగ్గుతుంది. ఇక రక్తంలో ట్రైగ్లిజరేట్స్ 35శాతం వరకు తగ్గనున్నాయి. ఇక రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున మునగాకు పొడి తినడం వల్ల మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయి 40 శాతం పెరుగుతుందని 2014 లో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసి నిరూపించారు. ఇక మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించి బీటాకెరోటిన్ కూడా మునగ ఆకులు చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక తరచూ వచ్చే జలుబు దగ్గు జ్వరం ఒళ్ళు నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యలను కూడా తొలగించడానికి మునగాకు పొడి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

Health Benefits of Drumstick Leaves
Health Benefits of Drumstick Leaves

ఇకపోతే మునగ ఆకు పొడి లో లభించే కొర్సటిన్, క్లోరోజనిక్ యాసిడ్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడతాయి. ఇక మునగాకు పొడి ని 8 గ్రాముల చొప్పున వాడినప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ 14 శాతం వరకు తగ్గుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. ముఖ్యంగా వందగ్రాముల మునగాకు పొడి లో ఉండే పోషక విలువల విషయానికి వస్తే.. కార్బోహైడ్రేట్లు 5.6 గ్రాములు, బీటా కెరోటిన్ 17542 మైక్రో గ్రాములు, ప్రోటీన్ 6.4 గ్రాములు, ఫ్యాట్ 1.6 గ్రాములు, ఫైబర్ 8.2 గ్రాములు, ఐరన్ 4.5 మిల్లీగ్రాములు, సోడియం 9.3 మిల్లీ గ్రాములు, విటమిన్ D2 14.3 మైక్రోగ్రాములు, క్యాల్షియం 314 మిల్లీగ్రాములు, విటమిన్ సి 108 గ్రాములు, అలాగే పోలిక్ యాసిడ్ 42 మైక్రో గ్రాములు మనకు ఈ మునగాకులో లభిస్తుంది.

మునగాకు పొడి ని ఎలా వాడాలి అంటే.. ఒక టేబుల్ స్పూన్ మునగ పొడిని తీసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు. లేదంటే వేడినీళ్లలో వేసి మునగ ఆకు పొడిని మరిగించి నిమ్మరసం, తేనె కలిపి టీ లాగా కూడా తాగవచ్చు. ఇకపోతే మునగాకు పొడి ని వంటల్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇక వెజిటబుల్ జ్యూస్ లాంటి వాటిల్లో కూడా ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని తింటే ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే మునగాకు వల్ల అందాన్ని , జుట్టును కూడా పెంపొందించుకోవచ్చు. ఇకపోతే ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండే పిల్లలకు ఈ పొడిని తినడం అలవాటు చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా పిల్లలు బలిష్టంగా తయారవుతారు. అంతే కాదు జబ్బుల బారిన పడకుండా ఉంటారు.ల‌