Somvati Amavasya : 30 ఏళ్లకు ఒకసారి వచ్చే సోమవతి అమావాస్య..  ఇలా చేశారంటే ఆర్థిక సంపద పెరిగినట్టే..!!

Somvati Amavasya : హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి అని పండితులు చెబుతుంటారు. ఇకపోతే హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు,  నియమాలు ఉన్నట్లుగానే వాటిని మనం క్రమం తప్పకుండా పాటించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే పండుగలకు , తిథులకు, వారాలకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే కొన్ని అమావాస్యలు చెడ్డవి అని.. ముఖ్యంగా ఆదివారం వచ్చే అమావాస్య మరింత ప్రమాదకరంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఈ సారి మాత్రం మే 30 వ తేదీన అనగా ఈ రోజు సోమవారం అమావాస్య రాబోతున్న నేపథ్యంలో తప్పకుండా కొన్ని పరిహారాలు చేస్తే ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరు ఏ కష్టం లో ఉన్నా సరే ఈ అమావాస్య రోజు ఇలా చేశారంటే కచ్చితంగా సమస్యలన్నీ తొలగి పోతాయని ఆర్థిక సంపద పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇక సోమవారం 30 సంవత్సరాల తర్వాత రాబోయే ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది అని .. నష్టాలు , కష్టాలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజు  పరిహారం చేసుకోవాలి సిందే అంటూ పిలుపునిస్తున్నారు పండితులు.

మరి ఇంతటి విశిష్టమైన అమావాస్య రోజు ఏం చేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రతి నెలలో కూడా అమావాస్యలు, పౌర్ణములు వస్తాయి. ఇక కొన్ని కొన్ని సార్లు ఆదివారం అమావాస్య వస్తే అది చాలా చెడ్డ రోజు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరికొంతమంది అమావాస్య రోజు ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ కొన్ని నియమాలను కూడా పెడుతూ.. వారు కూడా పాటిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మే 30వ తేదీన వచ్చే అమావాస్య కూడా చాలా ప్రత్యేకత ఉందని చెబుతున్నారు జ్యోతిష పండితులు. అమావాస్య అందులోనూ సోమవారం కావడంవల్ల శివుడికి కొన్ని విశిష్ట పూజలను ప్రజలు నిర్వహించబోతున్నారు. ఇక ఈసారి మే 30వ తేదీ రానున్న అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని పిలుస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఏర్పడిన అమావాస్యకు ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉంది. అందుకే  పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పితృ దోషం నుండి బయట పడ లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఇది సరైన సమయం అని ..కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా పొందవచ్చు అని పెద్దలు చెబుతున్నారు.

somvati amavasya 2022 date time and significance
somvati amavasya 2022 date time and significance

ఇకపోతే ఏకంగా 30 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అమావాస్య రోజు తప్పకుండా ప్రత్యేక పూజలు ..శివుడి ఆలయాన్ని దర్శించడం లాంటివి చేయడం వల్ల తప్పకుండా చికాకులు తొలగి పోయి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇక మీకు దగ్గరలో ఉన్న పండితుడు లేదా పురోహితుడు దగ్గరకు వెళ్లి అమావాస్య రోజు పితృ దోషం ఉంటే పరిహారం అడిగి తెలుసుకోగలరు. పితృ దోషం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అంటే చేసే పనులలో ఆటంకం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ,ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, లక్ష్మీదేవి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోవడం ,చుట్టుపక్కల వారితో అనవసరంగా గొడవలు,  ప్రయాణాలలో ఆటంకం , అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలు , నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పురోహితుడు దగ్గరకు వెళ్లలేము అనుకునేవారు నువ్వులు, బియ్యం కలిపి వండిన వంట ను కాకుల, కుక్కలకు వేయడం వల్ల పితృ దోషం పోతుంది అని చెబుతున్నారు. ఇక సోమవారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి సూర్యోదయం కంటే ముందే ఇంటిని శుభ్రపరిచి..తలంటు పోసుకొని దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి రాశిచక్రం ప్రకారం అభిషేకాలు చేయించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. 30 సంవత్సరాల తరువాత ఏర్పడబోయే ఈ అమావాస్య రోజు మీరు చేసే పూజలకు.. ఫలితాలు పొందడమే కాకుండా అదృష్టాన్ని , ఆర్థిక సంపదను తెచ్చిపెడతాయి.