Health Benefits : ఈ గింజలలో ఉన్న రహస్యం తెలిస్తే అస్సలు పారేయరు.. ఈ సమస్యలకు చెక్..

Health Benefits : ఆయుర్వేద వైద్యంలో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది.. పూర్వకాలం నుంచి ఈ కాయను అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది అనేక రకాల శారీరక రుగ్మతలను తొలగిస్తుంది. సాధారణంగా మనం ఉసిరికాయ ను వాడి అందులో ఉండే గింజలను పారేస్తాం కానీ.. ఉసిరి కంటే ఉసిరి గింజలలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు.. ఉసిరి గింజలు వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!! ఉసిరి గింజలలో విటమిన్ బి కాంప్లెక్స్ పొటాషియం కాల్షియం ఫైబర్ కెరోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ విత్తనాలలో ముఖ్యమైన పోషక విలువలు మెండుగా ఉన్నాయి.

ముందుగా ఈ విత్తనాలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున అర చెంచా ఈ పొడిలో తేనె కలిపి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది.చాలామందికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటివారు ఉసిరి గింజల పొడిని పేస్టులా తయారు చేసుకుని తలకు పట్టిస్తే ప్రయోజనం ఉంటుంది. ఎక్కిళ్ళు వస్తే ఓ పట్టాన తగ్గవు. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఉసిరి గింజలు పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

Amazing Health Benefits Of Amla Seeds
Amazing Health Benefits Of Amla Seeds

ఒక చెంచా ఉసిరి పొడికి రెండు చెంచాల పంచదార పొడిని కలపాలి. ఈ పొడిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది.ఉసిరికాయ గింజల పొడిని నీళ్లు కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని.. నిద్రపోయే ముందు నుదుటి పైన రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.. శరీరాన్ని చల్లబరుస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది. చర్మంపై పుండ్లు, గజ్జి, తామర, దురద ఉన్నచోట ఉసిరికాయ పొడిని నీళ్లలో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా మొటిమలు ఉన్నచోట ఈ పేస్ట్ రాస్తే త్వరగా పోతాయి. మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా పోగొడుతుంది.