Mahabharata : మహాభారతంలో కర్ణుడు.. మంచివాడు.. కాదా..!!

Mahabharata : మహాభారతంలో ముఖ్యమైన పాత్ర పోషించినది కర్ణుడు అని చెప్పవచ్చు.. కర్ణుడు వ్యక్తిత్వం తో పరిశీలిస్తే ఆయన పుట్టుకతోనే చెడ్డవాడు కాదు.. కర్ణుడు కుంతీదేవి , సూర్యభగవానుడికి జన్మించినవారు. వాస్తవానికి పాండవులు యుద్ధం లో గెలుస్తారని కర్ణుడికి ముందే తెలుసు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీకృష్ణుడు తిరిగి వెళుతూ ఉండగా కర్ణుడిని రథం ఎక్కించుకొని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు మాట్లాడుతూ ధర్మరాజు నిజంగానే ధర్మం ఎరిగినవాడు. ధర్మాన్ని కచ్చితంగా పాటించేవాడు ధర్మం అంతా పాండవుల వైపే ఉంది అందుకే సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడే వారి పక్షాన ఉన్నావు.. అందుచేతనే వారు గెలిచి తీరుతారని తెలియజేశారు.దుర్యోధనుని అందరూ కూడా యుద్ధ భూమిలో మరణిస్తారు.. ఎవరూ మిగలరు కాని దుర్యోధనుడిని నమ్మి నేను ఇంతకాలం ఉన్నా అతడిని విడిచి పెట్టి నేను రాలేను అందుచేతనే నాకు కూడా మరణమే శరణ్యం.. నేను కూడా అక్కడే మరణించాల్సిందే అని తెలియజేస్తారు కర్ణుడు. పాండవుల పక్కన ధర్మం ఉందని.. వారు ఖచ్చితంగా గెలుస్తారని వారి చేతిలో కౌరవులు మరణిస్తారని కర్ణుడికి కూడా ముందే తెలుసు.

ఇన్ని తెలిసినప్పటికి కర్ణుడు జీవితాంతం తప్పులే చేస్తూ ఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది..దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు.. అలాంటి దుర్యోధనుడు తో కలసి ఉన్నందుకు తన మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులు చేస్తూ వెళ్లాడు. చిట్టచివరకు యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణించాడు కర్ణుడు.. అలాగే మనిషి ఎంత మంచివాడు అయినప్పటికీ కూడా ఎంత చదువు చదువుకున్న వాడైనా సరే.. ఎంత మంచి గుణాలు ఉన్నప్పటికీ ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే వారికున్న పేరు ప్రతిష్టలు కూడా నశించిపోతాయని చెప్పవచ్చు.కర్ణుడు ఎలా జన్మించారు అంటే.. కుంతీదేవికి దుర్వాసమహర్షి.. ఒక వరాన్ని ప్రసాదిస్తాడు.. అదేమిటంటే సంతాన వరాన్ని ప్రసాదిస్తాడు. అంటే కుంతీదేవి తన ఇష్ట దైవాన్ని ప్రార్థించి.. నవమాసాలు మోయ కుండానే పుత్రునికి జన్మనివ్వగలదు. కుంతిదేవి ఆ మంత్రాన్ని పరీక్షించుకోవాలని వివాహానికి ముందే తన ఇష్టదైవాన్ని సూర్యుడిని ప్రార్థిస్తుంది. దాంతో కవచకుండలాలు కలిగిన కర్ణుడిని ప్రసాదిస్తారు. కోరిక కోరింది కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలను గుర్తుంచలేకపోయింది కుంతీదేవి. దీంతో వివాహానికి ముందే తల్లి అయ్యారనే ఈ విషయం అందరికీ తెలిస్తే నలుగురు ఏమనుకుంటారోనని లోకులకు భయపడి కర్ణుడిని ఒక నదీతీర ప్రవాహంలో వదిలిపెట్టింది.

In the Mahabharata, Karna is not good
In the Mahabharata, Karna is not good

అలా కర్ణుడు పెద్దవాడు అవ్వగానే.. విలువిద్యలు అంటే చాలా ఇష్టపడే వాడు. దాంతో కౌరవులు, పాండవులు ద్రోణాచార్య వద్ద శిక్షణ తీసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్లి నేర్పించమని అడగగా.. ఈ విద్య క్షత్రియులకు మాత్రమే.. సూత పుత్రులకు కాదని ద్రోణాచార్యుడు అంటారు. ఎలాగైనా అంతకుమించి విద్యను బోధించాలని పరశురామ ప్రభువు వద్దకు వెళతారు. అయితే పరశురామ ప్రభువు కేవలం బ్రాహ్మణ కుటుంబాలకు మాత్రమే ఇలాంటి విద్యను నేర్పుతారు. అది తెలుసుకొని కర్ణుడు బ్రాహ్మణుడు నీ అని అబద్ధం చెబుతాడు.అలా పరశురాముని దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఒకరోజు పరశురామ ప్రభువు కర్ణుడు ఒడిలో నిద్రిస్తూ ఉండగా.. ఒక కీటకము వచ్చి కర్ణుడిని కుడుతుంది. కానీ ప్రభువు నిద్ర ఆటంకం కలగకూడదని అలాగే కూర్చుండిపోయాడు కర్ణుడు. దాంతో రక్తం ఏరులై పారుతుంది. ఇంతటి సహనశక్తి కేవలం క్షత్రియులకు మాత్రమే ఉంటుందని అబద్ధము చెప్పి తన దగ్గర విద్యను అభ్యసించారు దాంతో. అవసరమైనప్పుడు తన దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతావ్ అనే శాపాన్ని పరశురామ ప్రభువు విధిస్తాడు.

కాని కర్ణుడు సూర్యపుత్రుడు అని తెలిసి భార్గవ అస్త్రాన్ని అందిస్తాడు పరశురామ ప్రభువు. దాంతో కర్ణుడి విద్యాభ్యాసం పూర్తి అవుతుంది.ఒకరోజు కర్ణుడు విలువిద్య ప్రదర్శిస్తున్నప్పుడు.. ఒక బాణం వెళ్లి దగ్గరలో ఉన్న ఒక ఆవును వదిస్తుంది. అది చూచి బ్రాహ్మణుడు ఎలాగైతే నువ్వు నాకు ఆధారమైన ఆవుని సంహరించి నిరాధారయుని చేశావో నువ్వు కూడా నీ అంతిమ ఘడియలను నిరాధారయునివి అవుతావని శపించడం జరుగుతుంది. ఇక ఇది అయిపోయిన తర్వాత ఒకరోజు కర్ణుడు రథం బయలుదేరుతున్న అప్పుడు కర్ణుడు రథం తగిలి ఒక పాప కిందికి పడిపోతుంది. అందులో నెయ్యి ఉంటుంది. అయితే ఆ పాత్ర లో నెయ్యి ఉలికిపోవడంతో ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. కర్ణుడు వేరే నెయ్యి ఇస్తానన్న కూడా తనకి ఆ నేయ్యే కావాలని అడగడంతో.. కర్ణుడు భూమిని పిండి ఆ పాత్రలోకి నెయ్యిని నింపుతూ ఉంటాడు. కర్ణుడు చేతుల్లో భూమాత కనిపించి నీ అంతిమ ఘడియల్లో నా భూమి లో చిక్కుకొని నువ్వు నిస్సహాయుడు అవుతావని శాపనార్థాలు పెడుతుంది. దీంతో కర్ణుడు యుద్ధభూమిలో నిస్సహాయుడై మరణిస్తాడు. నిజానికి కర్ణుడు దానం ధర్మం తెలిసినవాడు కాబట్టే కౌరవుల పక్షాన చేరినప్పటికీ ధర్మాన్ని వీడలేక వారి పక్కనే ఉండిపోతాడు.. మొత్తానికి అయితే మహాభారతంలో కర్ణుడి ని మించిన త్యాగశీలి గొప్పవాడు మరొకడు లేడు అని చెప్పవచ్చు.