Financial Wealth : ఆర్థిక సంపద పెరగాలంటే అక్వేరియంతో ఇలా చేయండి..!!

Financial Wealth : ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటే మరి కొంత మంది వివిధ వ్యాపారాలు.. సినిమాలు.. పెట్టుబడి మార్గాలు.. ఉద్యోగం.. అంటూ ఇలా రకరకాల పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సంపాదించిన డబ్బు నిలవాలంటే మనం పొదుపు చేయాలి. పొదుపు చేయడం వల్ల డబ్బు మిగులుతుందా అంటే కచ్చితంగా మిగులుతుందని చెప్పాలి. అయితే సంపాదించిన డబ్బు పొదుపు చేయడం వరకు మన చేతిలో నిలవడం లేదు అంటే కచ్చితంగా వాస్తుదోషాలు ఉన్నట్లే అని గమనించాలి. ఇక వాస్తు దోషాలు ఎప్పుడైతే మనలను ఆవహిస్తాయో తప్పకుండా మనం చేసిన పనికి ఫలితం లభించదు.కష్టానికి తగిన ప్రతిఫలం అందక పోతే ఏ వ్యక్తి అయినా సరే మానసికంగా కూడా కృంగిపోతారు. అందుకే మనం సంపాదించిన డబ్బును పొదుపు చేసే వరకు మన చేతిలోనే ఉండాలి అంటే కొన్ని వాస్తు నియమాలను కూడా పాటించాలి.

అలాంటి నియమాలలో అక్వేరియం కూడా ఒకటి. ఇకపోతే చాలామంది కేవలం అక్వేరియం మాత్రమే కాదు ఇంట్లో పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక అలాంటి వాటిలో కుక్క , కుందేలు , పిల్లి తో పాటు మరికొన్ని అందమైన పక్షుల ను కూడా పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే అక్వేరియం ని కూడా మనం అలా అందం కోసం మాత్రమే పెంచుకుంటారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.కానీ అక్వేరియం కేవలం ఇంటి అందాన్ని పెంపొందించుకోవడంలో కోసం మాత్రమే కాదు ఇంట్లో ఆర్థిక సంపదను పెంచడానికి కూడా సహాయపడుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి అది ఎలాగో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో చేపలను పెంచుకోవడం కూడా ఆర్థిక సంపదకు చిహ్నం గా పరిగణిస్తారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో చేపలు పెంచడంవల్ల పాజిటివ్ గా పరిగణిస్తారు. అందుకే కొందరు చేపలు పెంచడం అలవాటుగా మార్చుకున్నారు.

Do this with the Aquarium to increase Financial Wealth
Do this with the Aquarium to increase Financial Wealth

ఇకపోతే చేపలను ఇంట్లో పెంచడంపై శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అంటే.. లైవ్ ఫిష్ లేదా మెటల్ ఫిష్ ను వుంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల ప్రభావాలు తొలగిపోవడానికి ఇలా చేస్తూ ఉంటారు.ముఖ్యంగా విష్ణువు మత్స్య అవతారం కారణంగా ఇంట్లో చేపలను ఉంచడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇక ఇంట్లో ఆనందం నెలకొంటుంది. చేపలు నివసించే ప్రదేశంలో వ్యాధులు కూడా రావని , దీర్ఘకాలిక రోగాలను కూడా నయం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించాలి అంటే అక్వేరియంలో చేపలను పెంచాల్సిందే. ఇక ఎప్పుడైనా సరే మనసు బాగోలేనప్పుడు అక్వేరియం వైపు చూస్తూ ఉన్నట్లయితే వాటి చురుకుదనాన్ని చూసి మనస్సు ఆనందంగా పొంగిపోతుంది .ఫలితంగా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.అప్పుల బారిన పడకుండా చేపలు మనల్ని కాపాడతాయి కూడా..

చేపలు అక్వేరియంలో ఇంటికి, కార్యాలయానికి తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచిన ట్లయితే సంపద పెరుగుతుంది. కాబట్టి కనీసం వెండితో తయారు చేసిన చేప బొమ్మలను అయినా సరే మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా మంది లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలి అంటే బంగారు వర్ణం కలిగిన చేపలను పెంచుకోవాలి అని చెబుతూ ఉంటారు. అంతే కాదు తాబేలు విగ్రహాలను కూడా ఇంట్లో ప్రతిష్టించినట్లు అయితే ఆర్థిక సంపద కచ్చితంగా పెరుగుతుంది. కుబేరుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన ఉత్తర, ఈశాన్య దిక్కులలో వీటిని ఉంచినట్లయితే తప్పకుండా వారి అనుగ్రహం పొంది ఎప్పటికీ ఆర్థిక నష్టం కలగదు. పైగా అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే ఆర్థిక కష్టాలు తొలగిపోయి.. కుటుంబ సభ్యులతో సంతోషంగా.. ఆరోగ్యంగా.. సంపదలతో తులతూగుతూ వుంటారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్వేరియంలో మీరు చేపలను పెంచుకోవచ్చు.