Mosquitoes : దోమల బెడద ఎక్కువగా ఉందా.. అయితే ఈ మొక్కలు నాటాల్సిందే..?

Mosquitoes : దోమ.. ప్రతి వ్యక్తికి ఇబ్బంది కలిగించే జీవి అని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాదు ఈ దోమలు మనిషి ప్రాణాలను కూడా తీస్తాయి. ఇకపోతే వర్షాకాలం , ఎండాకాలం వచ్చిందంటే చాలు సాయంత్రం పూట ఇంటి చుట్టూ దోమల బెడద ఎక్కువ అవుతుంది. ఇక పిల్లలు పెద్దల వరకు ఈ దోమల నుంచి తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. డెంగ్యూ , మలేరియా వంటి ప్రమాదకరమైన , ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఇటీవల కాలంలో దోమలను ఎదుర్కోవడానికి అనేక రకాల మందులు, రసాయనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ రసాయనాలు, మందులు కొన్నిసార్లు దోమలనే కాకుండా ఇంటి సభ్యులను కూడా ప్రమాదంలో పడేస్తాయి.

ఇకపోతే ప్రస్తుతం దోమల బెడద ను తట్టు కోవాలి అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంటి చుట్టు పెంచినట్లయితే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఎలాంటి మొక్కలను ఇంటి చుట్టూ నాటితే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.ఇలాంటి మొక్కలను ఇంటి చుట్టూ నాటడం వల్ల ఇంటికి అందం పెంచడమే కాక ఈ మొక్కల వల్ల దోమల బెడద నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే ఆ మొక్కలు ఏమిటో ఒకసారి చదివి తెలుసుకోవాల్సిందే.

Is there a high incidence of Mosquitoes bites These plants are natalsinde
Is there a high incidence of Mosquitoes bites These plants are natalsinde

1. తులసి మొక్కలు : తులసి మొక్కను హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజించడమే కాకుండా ఆరాధ్యదైవంగా భావిస్తారు. ముఖ్యంగా తులసి మొక్కలను పూజించడం వల్ల ఇంటికి ధనప్రాప్తి కలగడమే కాకుండా దోమలను కూడా నివారించవచ్చు. ముఖ్యంగా దోమల ద్వారా ఇతర కీటకాలను చంపడంలో తులసి మొక్క చాలా సమర్ధవంతంగా సహాయపడుతుంది. ఇకపోతే ఇంటి ముందు మాత్రమే కాదు పెరట్లో కూడా తులసి మొక్కలను నాటడం వల్ల దోమలను తరిమి కొడుతుంది అలాగే కీటకాలకు కూడా దరిచేరవు.

2. గుల్ మెహందీ : దీనిని మనం రోజ్మెరీ అని పిలుస్తాము. ఇకపోతే ఇతర జీవుల భారీ నుంచి దూరంగా ఉంచడం లో చాలా సహాయపడే మొక్క గుల్ మెహందీ అని చెప్పవచ్చు. ఇక ఈ పూలు చాలా ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఇక ఇది దోమలను అలాగే ఇతర కీటకాలను కూడా దూరంగా ఉంచడం లో చాలా సమర్ధవంతంగా సహాయపడుతుంది. ఇక ఈ రోజ్మేరీ మొక్క వేడి, పొడి వాతావరణం రెండింటిలో కూడా బాగా పెరుగుతోంది. ఇక ఈ మొక్కలను ఇంటి చుట్టుపక్కల పెంచడం కూడా చాలా సులభం.

3. పుదీనా : పుదీనా.. ఈ వేసవిలో ఇంట్లో తయారు చేసే ప్రతి వంటలలో కూడా పుదీనాను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పుదీనా మంచి సువాసనను కలిగి ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇకపోతే పుదీనాను ఇంటి పెరటిలో పెంచడం వల్ల దాని ఘాటైన వాసనకు దోమలు, కీటకాలు దూరం అవుతాయి ఇక ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించలేవు. ఇకపోతే పుదీనా మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా సహాయ పడుతుంది.

4. బంతి పువ్వు : ప్రతి ఒక్కరికి పరిచయమైన ఈ మొక్కను ఇప్పటికే చాలామంది తమ పెరటిలో పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి రోజు పూజ చేయడానికి ఈ పూలను బాగా ఉపయోగిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా బంతి పూల మొక్కలు మన దేశంలో అనేక జాతులు ఉన్నాయి. ఇక ఈ పూలు ఎక్కువగా పసుపు రంగులోనూ లేత ఆకుపచ్చ రంగులో కూడా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా దోమలు, ఈగలు మరియు కీటకాలను అయినా సరే ఇవి దూరం చేస్తాయి. అంతే కాదు వీటి విలక్షణమైన వాసన పీల్చడం వల్ల దోమలు సైతం దూరం అవుతాయి.మీరు ఇంటి లోపల లేదా ఆరు బయట ఎక్కడైనా సరే ఈ మొక్కలను పెంచవచ్చు. ఇక ఇలాంటి మొక్కలను ఇంటి లోపల లేదా ఇంటి బయట పెంచుతున్నట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి దోమలు ప్రవేశించ లేవు.