Mahabharata : మహాభారతంలో ద్రౌపది జన్మ రహస్యం ఎట్టిది..!!

Mahabharata : ద్రౌపది అంటే మనకు ముందుగా ఐదు మంది భర్తలను కలిగి ఉన్న మహిళ అని అని పేరు ఉంది. కానీ ఈమె జన్మ రహస్యం ఏమిటి అని తెలిస్తే మాత్రం ఆమెను నెత్తిన పెట్టి పూజిస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక కుంతీదేవి కారణంగా ద్రౌపది ఐదు మంది భర్తలను పొందిన విషయం బహుశా చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఆమె మనస్ఫూర్తిగా అర్జునుడిని ప్రేమించినా..కుంతిదేవి కారణంగా ఐదు మంది పాండవులకు భార్య గా మిగిలిపోయింది. ఇక ఈమె జన్మ రహస్యం ఎట్టిధి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం..పాంచాల రాజ్యానికి రాజు అయిన ద్రుపదుని కి అగ్ని ద్వారా జన్మించింది ద్రౌపది. అగ్ని నుంచి జన్మించిన ఈమె చాలా అందగత్తె.. సుగుణాల రాశి.. ఇక ద్రౌపది అందానికి ఎంతటి వారైనా సరే మంత్ర ముగ్ధులు కావాల్సిందే. ఇకపోతే మహాభారతంలో పాండవుల కు భార్య అయిన ద్రౌపది ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కొడుకుకు జన్మనిచ్చింది. మొత్తం ఐదు మంది భర్త ల ద్వారా ఐదు మంది కొడుకులకు తల్లిగా మారింది ద్రౌపది. ఇక ఈ ఐదు మంది కుమారులను ఉపపాండవులు అని అంటారు.

The mystery of Draupadi birth in the Mahabharata
The mystery of Draupadi birth in the Mahabharata

యుధిష్టురుడు నుండి ప్రతివింధ్య, భీముడి నుండి సుతసోముడు, అర్జునుడి నుండి శృత కర్మ, నకులుడి నుండి సతానిక, సహదేవుడి నుండి శ్రుత సేన అనే ఐదు మంది కొడుకులకు ..ఐదు మంది భర్త ల ద్వారా జన్మనిచ్చింది. ఇకపోతే ఇదంతా ద్రౌపదీదేవి చివరి జన్మ లో జరిగిన విషయం . అయితే ఆమె మొదట జన్మ ఎట్టిది అనే విషయానికి వస్తే ద్రౌపది మొదటి జన్మలో ఇంద్రసేన గా మౌద్గల్యుడు అనే ముని కి భార్య గా ఉండేది. ఇతడు 5 శరీరాలు ధరించి ఆమె తో జీవనం చేశారు.ఇక రెండవ జన్మలో ద్రౌపది కాశీరాజు పుత్రికగా అనామికగా జన్మించింది. ఇక ఆమె చాలా సంవత్సరాలపాటు కన్య గానే మిగిలిపోయింది. శివుడి గురించి తీవ్ర తపస్సు చేసింది. ఒక రోజు అనుకోకుండా ఆమె భక్తికి ప్రసన్నుడయిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆమె పతి పతి అంటూ ఐదు సార్లు కోరింది. ఆ తరువాత శివుడు ఇంద్రుడిని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్ట వలసినదిగా శాసించాడు. ఇక ఆ పంచేంద్రియాలు ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని లు ఇలా ఐదు మంది కాగా వారి ద్వారా జన్మించిన వారే పంచపాండవులు.

The mystery of Draupadi birth in the Mahabharata
The mystery of Draupadi birth in the Mahabharata

మూడవ జన్మలో పాంచాల రాజ్య రాజు ద్రుపదుడు పుత్రికగా అగ్ని ద్వారా జన్మించింది ద్రౌపది. అర్జునుడు ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం బంధించి.. ద్రోణుడు ముందుంచుతాడు. ఇకపోతే ద్రోణుడిని చంపగల కుమారుడు.. అలాగే పరాక్రమవంతుడైన అర్జునుడిని భర్త గా పొందే కుమార్తెను పొందాలనే సంకల్పంతోనే యజ్ఞం చేస్తాడు. ఇక ఆ యాగం ద్వారా జన్మిస్తుంది ద్రౌపది. ద్రౌపది తర్వాత దృష్టద్యుమ్నుడు కూడా అగ్ని ద్వారా జన్మిస్తాడు. ఇకపోతే ఆమెను పార్ధునిడికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న దృపదుడు పాండవుల మరణించారన్న మాట విని ఆమెకు స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రం చేదించి ద్రౌపదిని వివాహం చేసుకొంటాడు.ఇక స్వయంవరం లో అర్జునుడు ద్రౌపదిని సొంతం చేసుకున్న తర్వాత మిగిలిన నలుగురు అన్నదమ్ములు, ద్రౌపదితో కలిసి కుంతిదేవి నివాసానికి వెళ్తారు.

The mystery of Draupadi birth in the Mahabharata
The mystery of Draupadi birth in the Mahabharata

ఇకపోతే పూజామందిరంలో దేవుడి స్మరణలో ఉన్న కుంతీదేవి.. తన కొడుకులు పాండవులు వచ్చిన విషయాన్ని.. వారు ఏ విషయం మీద అక్కడికి వచ్చారు అనే విషయాన్ని కూడా ఆమె గ్రహిస్తుంది కానీ తనకు ఏమీ ఎరగనట్టు వారు తెచ్చినది ఏదైనా సరి సమానంగా పంచుకోవాలని ఆజ్ఞ వేస్తుంది. అయితే కుంతీదేవి ఇలా చెప్పడానికి కారణం ఒకరు సంతోషాన్ని పొందితే మిగిలిన నలుగురు మనస్థాపం చెందుతారు అనే కారణంగా ఏమి జరిగినా సరే తెచ్చింది ఒక ఆడదానిని అని తెలిసి కూడా ఆమె సరి సమానంగా పంచుకోవాలని ఆజ్ఞ వేస్తుంది. కానీ ద్రౌపది అందుకు ఒప్పుకోదు. కానీ ఆమెను ఒప్పించి.. ఐదు మంది భర్తలకు భార్య అవ్వాలని సూచిస్తుంది. ఇక అలా ఆమె ద్రౌపది పాండవులకు భార్య గా గుర్తించబడుతుంది. ఒకరోజు కౌరవసభలో దుర్యోధనుడు చేత ఘోరంగా అవమానపడ్డ ద్రౌపది కురుక్షేత్ర యుద్ధం జరగాలని శాసిస్తుంది. ఇక ఆ యుద్ధంలో తన భర్త ఐదుగురిని తప్ప అందరిని కోల్పోతుంది. చివరికి కొడుకులను కూడా కోల్పోతుంది.