Health Benefits : కొబ్బరి టీ ఎప్పుడైనా టెస్ట్ చేశారా..!? ఒక్కసారి రుచి చూస్తే వదలరు..!

Health Benefits : సాధారణంగా టీ అంటే పాలతోనే తయారు చేసుకుంటాం.. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఇంట్లో పాలు విరిగిపోవడం లేదంటే.. సమయానికి పాలు అందుబాటులో లేకపోవడం జరిగితే.. ఆ పూట టీ తాగకుండా మానేస్తాము. అలాకాకుండా కొబ్బరి తో కూడా టీ తయారు చేసుకుని తాగవచ్చు..! ఎలా తయారు చేసుకోవాలో.. ఏం కావాలో ఇప్పుడు చూద్దాం..!

ఒక కప్పు కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు, రెండు స్పూన్లు టీ పొడి, ఒక యలుక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క అవసరం. ముందుగా కొబ్బరినీ సన్నగా తరగాలి. ఈ ముక్కలలో కాసిన్ని నీళ్లు పోసి మిక్సి పట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో టీ పొడి, యలుక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.

health benefits in Coconut Tea
health benefits in Coconut Tea

బాగా మరిగిన తర్వాత చివరిలో కొబ్బరి పాలు పోసి ఒక నిమిషం పాటు మరిగించాలి. కొబ్బరి పాలు పోసి ఎక్కువ సేపు మరిగిస్తే పాలు విరిగిపోతాయి. పాలు కాగిన తరువాత ఒక గ్లాసు లోకి టీని వడపోసుకోవాలి. వేడివేడిగా కొబ్బరి టీ తాగడానికి రెడీ. కొబ్బరి టీ తాగితే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె పోటు రాకుండా చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ టీ అనేక రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి.