Beauty Tips : వీటితో మీ పాదాలను అందంగా తీర్చిదిద్దుకోండి..!!

Beauty Tips : అందం అంటే కేవలం ముఖం తెల్లగా, మచ్చలు లేని చర్మం ఉంటే సరిపోదు.. చేతులు, పాదాలు కూడా అంతే మృదువుగా కాంతివంతంగా ఉన్నప్పుడే అందం రెట్టింపు అవుతుంది. ఇక అందులో భాగంగానే చాలామంది పాదాలపై శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా పాదాల చర్మం పొడిబారినట్లు అనిపించడం.. అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఎలాంటి చిట్కా పాటించి పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. అయితే మీ ఇంట్లో అక్క , చెల్లి, అమ్మ, అత్త, వదిన ఇలా ఎవరైనా సరే పాదాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.

పాదాలను అందంగా , ఆరోగ్యంగా తీర్చిదిద్దడంలో గ్రీన్ టీ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో నాలుగు గ్రీన్ టీ బ్యాగులను వేయాలి. ఇక గ్రీన్ టీ మొత్తం నీటిలో కలిసే లోపు మీరు సబ్బుతో మీ పాదాలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో గ్రీన్ టీ పూర్తిగా కలసిపోయినప్పుడు కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు 20 నిమిషాల పాటు మీ పాదాలను బకెట్ నీళ్ళలో ఉంచాలి. తర్వాత పాదాలను బయటకు తీసి ఏదైనా బ్రష్ సహాయంతో పాదాలపై రుద్దడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి.

Beauty Tips in Good benefits of drinking green tea
Beauty Tips in Good benefits of drinking green tea

ఇక తర్వాత మరొకసారి సబ్బుతో కడిగి ఏదైనా మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీర్ణశక్తి మెరుగు పడడమే కాదు డయాబెటిస్ వారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రతిరోజూ అల్పాహారం తర్వాత కాఫీ , టీలకు బదులుగా గ్రీన్ టీ తాగితే మంచి ప్రయోజనాలు లభిస్తాయి