Beauty Tips : టమోటా లలో దీన్ని కలిపి రాస్తే మీ ముఖం మెరిసి పోవాల్సిందే..!!

Beauty Tips : సాధారణంగా టమోటాలు ముఖ చర్మాన్ని పెంపొందించుకోవడానికి చాలా రకాలుగా సహాయపడతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టమాటాలను ముక్కలుగా కోసి దానిపై చక్కెర వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు కూడా దూరమవుతాయి. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా, తెల్లగా మెరిసి పోవాలని కోరుకుంటారు. ఇక ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇక అందరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్స్ అప్ ద్వారా షేర్ చేయండి.

ఇక ఈ ప్యాక్ కోసం టమోటాను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్ ను మూడు స్పూన్లు ఒక బౌల్ లో వేయాలి. అలాగే అర టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ను కూడా కలపాలి. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. ఆ తర్వాత ఒక విటమిన్ E క్యాప్సుల్ ను తీసుకొని అందులో ఆయిల్ ను బౌల్ లో వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Tomato Face Pack Beauty Tips With Home Remedies
Tomato Face Pack Beauty Tips With Home Remedies

టమోటాలో ఉండే లైకోపిన్ అనే ఎంజైమ్ చర్మం తెల్లగా మెరవటానికి సహాయపడుతుంది. మిల్క్ పౌడర్ చర్మాన్ని టైట్ గా ఉంచి యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. పసుపు చర్మ ఛాయను మెరుగుపరచటానికి సహాయపడుతుంది. ఇక విటమిన్ ఈ క్యాప్సుల్ చర్మానికి పోషణను అందిస్తుంది. అందుకే ఈ మూడింటి మిశ్రమంతో ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఎప్పుడైనా ఎక్కడైనా ఖర్చులేకుండా ఉపయోగపడే ఈ ఫేస్ ప్యాక్ తో చర్మం అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.