Chamomile Tea : కమోమిల్ టీ టెస్ట్ చేశారా..! ఈ ప్రయోజనాలు మిస్స్ కాకండి..!

Chamomile Tea : వేడి వేడిగా టీ తాగిందే.. కొంతమందికి రోజు గడవదు.. హెర్బల్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ అంటూ రకరకాల టీ లు అందుబాటులో ఉన్నాయి.. టీ ప్రియులు ఇప్పటికే టెస్ట్ చేసే ఉన్నారు.. హెర్బల్ టీ లలో గడ్డి చామంతి పూల టీ కూడా ఒకటి.. ఈ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే..! ఆ ప్రయోజనాలు ఏంటంటే..!?గడ్డి చామంతి పూల టీ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

దాంతో టెన్షన్, ఒత్తి,డి డిప్రెషన్ దూరం చేసి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ టి గొప్ప వరంగా చెప్పవచ్చు. ఈ టిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించి, హానికర బ్యాక్టీరియా, వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఈ టి తాగితే జలుబు తగ్గుతుంది. ఈ టీ ఆవిరి పిలిస్తే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అన్ని రకాల ఉదర సమస్యలను తగ్గిస్తుంది.

health benefits in Chamomile Tea
health benefits in Chamomile Tea

ఈ టీ రుతుక్రమం సమయంలో తాగితే పీరియడ్స్ లో వచ్చే నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ టీ తాగితే మొటిమలు తగ్గుతాయి. ఇందులో ఉండే మెలనిన్ వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. కంటి కింద డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుంది. జుట్టుకు పోషణను అందించి బలంగా తయారు చేస్తుంది.