Simhadwaram : ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహద్వారం వద్ద ఈ వస్తువులు ఉంచకూడదు..!

Simhadwaram : ప్రతి ఇంటికి సింహద్వారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా లోపలికి వెళ్ళాలి అంటే సింహద్వారం లో ఉన్న గడపన దాటుకొని ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉండే గడప ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. ప్రతిరోజు నీటితో శుభ్రం చేసి.. పసుపు కుంకుమలతో గడపను అలంకరిస్తూ ఉంటారు. ఇక ఇంట్లో ఉండే గడప అయినా దేవాలయాల్లో ఉండే గడప అయినా మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు.. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం గడప పవిత్రమైనదిగా భావిస్తారు.అంతేకాదు కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు గడప పెట్టే రోజున తిధి.. నక్షత్రం..

రోజు.. సమయం చూసి మరీ నవధాన్యాల తో అలంకరించి ఆడపడుచు తో.. గడపకు పసుపు రాయించి.. మామిడి తోరణం కట్టించి.. పూలదండ వేయించి ..గడపను అలంకరించి .. ఆడబిడ్డకు కాసులు ఇచ్చి ఆ పూజ చేయిస్తారు. ఇదంతా చూస్తే ఆ గడప కు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సైన్స్ ప్రకారం గా చూసుకుంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండే గుమ్మాన్ని పెట్టినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సింహద్వారం వద్ద ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేదా తీసుకోవాలి అనుకున్నప్పుడు

Importance of House Main Door Simhadwaram
Importance of House Main Door Simhadwaram

గుమ్మం లోపలికి వచ్చి పని పూర్తి చేయాలి.. లేదా గుమ్మం బయటకు వెళ్ళి ఆ పని పూర్తి చేయాలి. కొంతమంది సింహద్వారం వద్ద చీపురు, చాట లాంటి వస్తువులను పెడుతూ ఉంటారు. ఇలాంటివి పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించలేదట. ఇక గడపకు ప్రతి రోజూ పసుపు రాయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆనందించడంతోపాటు ఇంట్లోకి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ప్రవేశించలేవు..అలాగే మన ఒంటి పైన ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.